Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ కు 30 సీట్లకే అధికారం
By: Tupaki Desk | 15 Jan 2016 5:15 AM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పదవిని దక్కించుకోవాలంటే టీఆర్ ఎస్ కు కేవలం 30 డివిజన్లు గెలుచుకుంటే చాలట. 30 నుంచి 35 డివిజన్లు గెలుచుకుంటే గ్రేటర్ పీఠం గులాబీదేనట. ఇదెలా సాధ్యమంటే ఇందుకు కొన్ని లెక్కలను చెబుతున్నారు టీఆర్ ఎస్ నేతలు. మంత్రి కేటీఆర్ కూడా ఇదే భరోసాతోనే గ్రేటర్ పీఠంపై జెండా ఎగరేయకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారట.
జీహెచ్ ఎంసీ మేయర్ పదవిని దక్కించుకోవాలంటే ఏ పార్టీకినా 103 సీట్లు కావాలి. వీటిలో టీఆర్ ఎస్ కు ఎక్స్ అఫీషియో రూపంలో ఇప్పటికే 24 సీట్లు ఉన్నాయి. అలాగే మజ్లిస్ కు మరో పది సీట్లు ఉన్నాయి. అంటే టీఆర్ ఎస్, మజ్లిస్ కలిపి ఇప్పటికే 34 సీట్లను గెలుచుకున్నట్లే. దీనికితోడు, గ్రేటర్ ఎన్నికలు ఎటువంటి పరిస్థితుల్లో జరిగినా మజ్లిస్ కు 35 సీట్లు గ్యారంటీ. 40 వరకూ వచ్చే అవకాశాలు ఉన్నా.. 35 అయితే గ్యారంటీ. అంటే, ఎక్స్ అపీషియో సీట్లు 35; మజ్లిస్ కు గ్యారంటీ అయిన 35 సీట్లను కలిపితే 70 సీట్లు ఇప్పటికే మజ్లిస్, టీఆర్ ఎస్ ఖాతాలో పడినట్లే. ఇక మరో 35 సీట్లను టీఆర్ ఎస్ సాధిస్తే చాలు.. గ్రేటర్ పీటం గులాబీదే.
హైదరాబాద్లోని సెటిలర్లంతా, విద్యావంతులంతా మూకుమ్మడిగా బీజేపీ, టీడీపీ కూటమికి ఓటు వేసినా.. బస్తీల్లో కాంగ్రెస్ పట్టు కోల్పోయింది కనక బస్తీలు తమవేనని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే బస్తీలే ప్రధాన ఎజెండా రకరకాల వరాలు గుప్పించింది. వారికి విద్యుత్తు బకాయిలు, నీటి బకాయిలు రద్దు చేసింది. ఆస్తి పన్ను బకాయిలు రద్దు చేసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆశ చూపింది. ఇక టీఆర్ఎస్ ఇటీవల అంతర్గతంగా సర్వే చేయించుకుందని సమాచారం. అందులో కారుకు 40 వరకూ సీట్లు వస్తాయని వచ్చినట్లు టీడీపీ, బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు మజ్లిస్, ఇటు ఎక్స్ అఫీషియో సీట్లను పరిగణనలోకి తీసుకుంటే అధికారం దక్కినట్లేనని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని, కేటీఆర్ సవాల్ కూడా అందులో భాగమేనని చెబుతున్నారు.