Begin typing your search above and press return to search.

మెజారిటికై కసరత్తు.....

By:  Tupaki Desk   |   10 Sep 2018 10:24 AM GMT
మెజారిటికై కసరత్తు.....
X
తెలంగాణకు ముందస్తు ఎన్నికలకు సర్వత్రా సిిద్దం అవుతోంది. ఎత్తుకు పైఎత్తులతో - వ్యూహలకు ప్రతివ్యూహాలతో రాజకీయ నేతలు సిద్దవమవుతున్నారు. 2014లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి, మళ్లి భారీ మెజారిటీ దిశగా పావులు కదుపుతోంది. 2014 ఎన్నికలలో తెరాస 30 స్థానాలలో 20 వేలకు పైగా మెజారిటీ సాధించి గెలుపొందింది. ఈ 30 స్థానాలలోను మళ్లీ భారీ మెజారిటీతో గెలవాలని తెరాస కసరత్తు ప్రారంభించింది. ముందస్తు ఎన్నికల జాబితాలో 30 స్థానాలకి 27 ప్రకటించింది. మిగత మూడు స్థానాలు త్వరలో ప్రకటిస్తామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు.

మొదటి నుంచీ సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర సమితికి మంచి బలం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ ఆరుసార్లు గెలుపొందారు. 2014లో కూడా హరీష్‌ రావు ఈ నియోజకవర్గం నుంచి పోటి చేసి భారీ అధిక్యంతో గెలుపొందారు. ఈసారి కూడా సిద్దిపేట నుంచి హరీష్ రావు గెలుపు ఖాయమని తెరాస అధష్టానం ధీమాగా ఉంది.

సిరిసిల్లలో కల్వకుంట్ల తారక రామారావుకు 53000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన మంత్రి అయిన తర్వాత తన నియోజకవర్గాన్ని చాలా అభివ్రుద్ది చేసారు. అక్కడ కేటీఆర్‌ కు మంచి బలం ఉంది. కావున అక్కడ తమకు ఎదురు లేదని తేరాస భావిస్తోంది. స్టేషన్‌ ఘన్‌ పూర్‌ కు చెందిన తెరాస మంచి బలం ఉన్నప్పటికి - స్థానికంగా ఉన్న మరో నేతతో విభేదాలు కారణంగా అక్కడ తెరాసకు అనుకున్నంత మెజారిటి రాకపోవచ్చునని భావిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కొండా సురేఖకు టిక్కట్టు దక్కలేని కారణంగా - ఆవిడ పార్టీకి రాజీనామా చేసారు. అయితే వరంగల్ జిల్లాలో తమ పార్టీ నుంచి ఏ అభ్యర్ది పోటి చేసిన గెలుపు ఖాయమని తెరాస నాయకులు భావిస్తున్నారు. ఇలా గత ఎన్నికలలో తమ నియోజకవర్గాలలో భారీ మెజారిటీ సాధించిన అభ్యర్దులకే తెరాస అధిష్టానం ముందస్తుకు టిక్కెట్లు సాధించింది. ఆ నియోజక వర్గాలలో తమ పార్టీయే తిరిగి పాగా వేస్తుందని తెరాసా అధిష్టానం ధీమాగా ఉంది.