Begin typing your search above and press return to search.
కేసీఆర్ కొత్త ఆపరేషన్ ప్రారంభం అయింది
By: Tupaki Desk | 19 Jan 2016 7:58 AM GMTగ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఆయా పార్టీల అంతర్గత పరిణామాలతో అభ్యర్థుల ఎంపికలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ ప్రక్రియ ముగిసినప్పటికీ ఇపుడు గ్రేటర్ లో ఏం జరుగుతోందనే ప్రచారం తెరమీదకు వస్తోంది. అసమ్మతితో పాటు అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేసిన వారిని ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకునేందుకు సైతం రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలను రచిస్తున్నారు. నిన్నటి వరకు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పార్టీ క్యాడర్ కు విసృత్తంగా నూరిపోయిన అధిష్టానానికి చుక్కలను చూపించే రీతిలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు రెబల్ గా నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ పరిస్థితి విపక్షాల కంటే అధికార పార్టీకే రెబల్స్ బెడద ఎక్కువగా వుండడం విశేషం. దీంతో అధికార టీఆర్ ఎస్ కు సరికొత్త తలనొప్పులు వచ్చి చేరాయి. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వారిని కాదని ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యతనివ్వడం పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు నాటి నుంచి ఈ రోజు వరకు సొంత ప్రయోజనాలపు పక్కనపెట్టి అటు ఉద్యమంతో పాటు ఇటు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర నిర్వహించిన వారిని పక్కన పెట్టారు. అంతేకాకుండా ఉద్యమ కాలంలో కేసుల తోపాటు జైళ్లకు వెళ్లిన వారిని కూడా పట్టించుకోకుండా గ్రేటర్‌లో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
ఈ అంశాలకు సంబంధించిన పార్టీ నేతలు గుర్రుగా వున్నారు. వలసలకే అధిక ప్రాధాన్యనిచ్చిన టీఆర్ ఎస్ అగ్రనేతలు పాతవారికి ఎలాంటి అన్యాయం చేయబోమని వారికి పార్టీలో సముచిత గౌరవంతో పాటు హోదాను కల్పిస్తామని చెప్పినా... రెబల్ అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఈ అంశం పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చే విధంగా ఉంటుందని, ఈ అసంతృప్తిని వెంటనే చల్లార్చేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం డివిజన్ల స్థాయిలో ఇంఛార్జీలుగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులంతా రంగంలోకి దిగాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
గ్రేటర్ బరిలో మొదటిసారిగా టీఆర్ ఎస్ మొత్తం 150 డివిజన్ల నుంచి పోటీ చేస్తోంది. మేయర్ పీఠమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్ ఎస్ ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే బరిలో దిగే అభ్యర్థుల జాబితాల్లో పూర్తిగా వలసల నేతలకు అగ్రతాంబూళం అందించింది. మొత్తం 150 డివిజన్ల నుంచి 150 మందిని బరిలోకి దింపిన టీఆర్ ఎస్ ఇందులో 80 శాతానికి పైగా కొత్త వారికే టిక్కెట్లను ఇచ్చింది. పార్టీ నేతలకు కేవలం 20 శాతానికి మించకుండా అభ్యర్ధులను బరిలోకి దించారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ నాయకులకు న్యాయం చేయలేకపోయింది. ఈ క్రమంలోనే గ్రేటర్ లో కనీసం వంద స్థానాలకు తగ్గకుండా విజయం సాధించాలని బావిస్తున్న టీఆర్ ఎస్ కు ఈ పరిణామాలు తీరని షాక్ నిచ్చే పరిస్థితి వుందని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే రెబల్ నేతలను బరి నుంచి తప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నేతలు భావిస్తున్నారు. నేతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోననే మీ మాంస అగ్రనేతల్లో వ్యక్తమవుతుండడం విశేషం.