Begin typing your search above and press return to search.
గులాబీ చొక్కాలు చించేసుకొంటున్నారు!
By: Tupaki Desk | 12 April 2015 6:26 AM GMTఒకవైపు తమ పార్టీ అన్ని పార్టీలనూ స్వీప్ చేసేస్తోందని.. గులాబీ పార్టీ ముఖ్య నేతలు చెప్పుకొంటున్నారు. తెలంగాణలో తాము అత్యంత పవర్‌ఫుల్ అని చెప్పుకొంటున్నారు. మిగిలిన పార్టీలన్నీ ఖాళీ అయిపోయి.. తమ పార్టీ లోకి వచ్చే నేతలు ఎక్కువవుతుండటంతో హౌస్‌ఫుల్ బోర్డు కూడా పెట్టేశామని ఈ పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే వచ్చిన వారి మధ్యనే సరైన సఖ్యత కనిపించడం లేదు. ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీలోకి వచ్చిన వారికీ, ఆది నుంచి ఈ పార్టీలో ఉన్న వారికి మధ్య రచ్చ జరిగింది. పార్టీ కార్యకర్తల్లో వర్గ పోరాటం తీవ్రం అయ్యింది!
ఒక వర్గంపై మరో వర్గం రాళ్లతో దాడులు చేసుకొనేంత వరకూ వెళ్లింది పరిస్థితి. చొక్కాలు చించుకొన్నారు.. రక్తం చిందించారు! ఖమ్మం జిల్లాలో తెరాస శ్రేణుల మధ్య గొడవలు జరగడం ఇది కొత్త కాదు!
తెలంగాణ వచ్చాకా.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకా.. ఇక్కడ చాలా మంది గులాబీ చొక్కాలు తొడిగారు. ఇప్పుడు వారే అధికారం చెలాయిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఆది నుంచి పార్టీలో ఉన్న వారు భరించలేకపోతున్నారు. తీవ్రమైన నిరసన తెలుపుతున్నారు.
12 యేళ్ల నుంచి పార్టీ తరపున తిరిగిన వాళ్లను కాదని.. కొత్తగా పార్టీ లోకి వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇవ్వడం ఏమిటి? అంటూ.. వారు విరుచుకుపడుతున్నారు.
ఈ రచ్చలు తీవ్రస్థాయిలో ఉండే సరికి.. సెన్సిటివ్‌గా ఉండే రాజకీయ నేతలు చాలా ఫీలవుతున్నారు. టీఆర్‌ఎస్ తరపున పనిచేయడమే తప్పవుతోందా? అనే అంతర్మథనం కూడా కనిపిస్తోంది వీరిలో! మరి పార్టీలోకి అందరూ వచ్చి చేరుతున్నారని పండగ చేసుకోవడం మాట ఎలా ఉన్నా.. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడంపై టీఆర్‌ఎస్ అధినాయకత్వం దృష్టి సారించాలిప్పుడు!