Begin typing your search above and press return to search.
కేసీఆర్‌నే అనేంత పోటుగాడా..?
By: Tupaki Desk | 5 July 2015 5:06 AM GMTసాధారణంగా ఏదైనా కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తే ఎలా ఉంటారు? విపరీతంగా కుంగిపోతారు. కృశించిపోతారు. అవమాన భారంతో ముఖం చాటేసే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం తెలిసిందే.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ కావటమే కాదు.. కెమేరాల సాక్షిగా ఆయన అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జైలుకు వెళ్లి.. నెల రోజుల తర్వాత జైలు నుంచి తిరిగి బయటకు బెయిల్ మీద వచ్చేయటం తెలిసిందే. అయితే.. బెయిల్ మీద బయటకు వచ్చిన రేవంత్‌ను పెద్ద సంబరంగా.. భారీ ర్యాలీ నిర్వహించి మరీ తీసుకెళ్లటాన్ని టీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రినే అన్నేసి మాటలు అనేంత పోటుగాడా రేవంత్ అని ఆవేశపడిపోతున్న వారూ ఉన్నారు.
మరీ ముఖ్యంగా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. మంత్రివర్గ సభ్యులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేయటం.. తిట్టిన తిట్లు సైతం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించే కొన్ని పదాల్ని భారీగా వాడటంపై తెలంగాణ అధికారపక్షం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయి కూడా మరీ అంత బరితెగింపుతో ఎలా మాట్లాడతారు? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.
దీనికితోడు.. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి.. ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారని ఏ మాత్రం ఊహించని గులాబీ దళానికి రేవంత్ తీరు మంట పుట్టిస్తోంది. తమ అధినేతను ఇష్టారాజ్యంగా అన్నేసి మాటలు అంటాడా? అని వారు మండిపడుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ రేవంత్‌ను వదిలి పెట్టకూడదని.. ఈ విషయంలో చట్టం తన పని తాను పక్కాగా చేసుకుపోవాలని వారు సూచిస్తున్నారు. మంత్రులు సైతం.. ఇలాంటి మాటను బలంగా వినిపిస్తున్నట్తు లెలుస్తోంది. మొత్తం వ్యవహారం చూస్తుంటే.. బెయిల్ మీద బయటకు వచ్చిన రేవంత్ మాటలకు గులాబీ దళం తీవ్రంగా పీలైనట్లు కనిపిస్తోంది.