Begin typing your search above and press return to search.

'లగడ' జగడం.. బాబు - కాంగ్రెస్ ప్లానేనా?

By:  Tupaki Desk   |   1 Dec 2018 5:42 AM GMT
లగడ జగడం.. బాబు - కాంగ్రెస్ ప్లానేనా?
X
ఆయనొక్కడు.. వీళ్లు నలుగురు.. బలమైన టీఆర్ ఎస్ అధినేతను ఓడించేందుకు ఆంధ్రా లాబీయింగ్ రంగంలోకి దిగినట్టే కనిపిస్తోంది. బాబు ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను దెబ్బకొట్టే వ్యూహానికే పక్కాగా ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది.

కేసీఆర్ తెలంగాణలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులకు అందనంత జెట్ స్పీడుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన్ను అందుకోలేక ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెరవెనుక దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి..

ఇప్పటికే చంద్రబాబు తెలంగాణలో మీడియా మేనేజ్ మెంట్ చేసి కాంగ్రెస్ పేరుతో కోట్లు ఖర్చు చేస్తూ అడ్వటైజ్ మెంట్లు ఇప్పిస్తున్నారనే టాక్ బయటకు వచ్చేసింది.. దీనికోసం ఏకంగా ఆంధ్రాకు చెంది జనార్దన్ అనే వ్యక్తిని కూడా నియమించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు కొత్తగా తిరుమలలో లగడపాటి తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని బాంబు పేల్చడం వెనుక కూడా కాంగ్రెస్-బాబు లాబీయింగ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. లగడపాటి తిరుమలలో 10 మంది ఇండిపెండెంట్లు తెలంగాణలో గెలవబోతున్నారని ప్రకటించగానే తెలుగుదేశం అధినేతకు దగ్గరైన మీడియా అధినేత నిన్న రాత్రి లగడపాటిని తన చానెల్ కు పిలిపించి మరీ డిబేట్ పెట్టారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందంటూ లీకులు ఇప్పించారు. ఇలా చంద్రబాబు అండ్ కాంగ్రెస్ కూటమి టీఆర్ ఎస్ పై అవాస్తవాలు ప్రచారం చేసేందుకు సిద్ధమైందని అర్థమవుతోంది..

దీన్ని ముందే పసిగట్టిన టీఆర్ ఎస్ పార్టీ నిన్న రాత్రి లగడపాటి సర్వేలు అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారంటూ తెలంగాణ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ - బాబు ప్రోద్బలంతోనే లగడపాటి సర్వేలంటూ డ్రామాలాడుతున్నారని.. చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో లగడపాటిపై ఈసీ చర్యలు సిద్ధమైంది. మరి ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారన్నది తేలాల్సి ఉంది. కేసీఆర్ ను దెబ్బతీసేందుకు చేస్తున్న ఈ ఎత్తులకు గులాబీ అధినేత ఎలా చిత్తు చేస్తాడనేది వేచిచూడాల్సి ఉంది.