Begin typing your search above and press return to search.

ఫిట్ నెస్ కోసం గులాబీ నేత‌ల క‌స‌ర‌త్తు!

By:  Tupaki Desk   |   22 July 2018 6:17 AM GMT
ఫిట్ నెస్ కోసం గులాబీ నేత‌ల క‌స‌ర‌త్తు!
X
ఉద్య‌మ పార్టీగా ప్ర‌యాణం మొద‌లు పెట్టి.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో స‌క్సెస్ కావ‌ట‌మే కాదు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌క్సెస్ అయిన టీఆర్ ఎస్ నేత‌లు ఇప్పుడు ఫిట్ నెస్ మీద పెడుతున్న దృష్టి ఆస‌క్తిక‌రంగా మారింది. నిత్యం ఉరుకులుప‌రుగుల‌తో ఉక్కిరిబిక్కిరి అయ్యే నేత‌లు.. ఫిట్ నెస్ మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించ‌టం విశేషం.

నేత‌ల‌న్న వెంట‌నే.. బాన క‌డుపు.. ఫిట్ నెస్ మీద ఏ మాత్రం ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌టం లాంటివి తెలిసిందే. కానీ.. ఇందుకు భిన్నంగా గులాబీ నేత‌లు క‌స‌ర‌త్తు చేస్తుండ‌టం విశేషం. ఆరోగ్యం విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించ‌ట‌మే కాదు.. తీసుకునే ఆహారం విష‌యంలోనూ వారు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎవ‌రి దాకానో ఎందుకు మంత్రి కేటీఆర్ విష‌యానికే వ‌స్తే.. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వేళ‌లో ఆయ‌న ఒక పండు మాత్ర‌మే తీసుకుంటారట‌. కాకుంటే.. రోజుకో పండును ఆయ‌న తీసుకోవ‌టం ఉంటుంది. అదే ఆయ‌న మ‌ధ్యాహ్న భోజ‌నంగా చెబుతున్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌న నియ‌మానికి మిన‌హాయింపు ఇచ్చినా.. తీసుకునే ఆహారం.. దాని కేల‌రీస్ విష‌యంలో మాత్రం జాగ్ర‌త్త‌గా ఉంటార‌ని చెబుతున్నారు.

ఇక‌.. మ‌రో మంత్రి హ‌రీశ్ సైతం ఫిట్‌ నెస్ కు భారీ ప్రాధాన్య‌త‌ను ఇస్తార‌ని చెబుతున్నారు. పొద్దున నుంచి రాత్రి వ‌ర‌కూ నాన్ స్టాప్ గా ప‌నిలో ఉన్నా.. లంచ్‌.. డిన్న‌ర్ విష‌యంలో మాత్రం ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌గా ఉంటార‌ని చెబుతున్నారు. ఎక్కువ ప‌ని చేయ‌టం త‌క్కువ ఫుడ్ తీసుకోవ‌టం అన్న‌ది ఆయ‌న నియ‌మంగా చెబుతున్నారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం మిస్ అయితే.. సాయంత్రం వేల‌లో మొక్క జొన్న గింజ‌ల‌తో త‌యారు చేసిన స్నాక్స్ ను నాలుగైదు స్పూన్లు మాత్ర‌మే తీసుకునే హ‌రీశ్‌.. రాత్రి డిన్న‌ర్ విష‌యంలో ఒక ఫ్రూట్ మాత్ర‌మే తీసుకుంటార‌ని చెబుతున్నారు.

కేటీఆర్.. హ‌రీశ్ మాత్ర‌మే కాదు.. టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ప‌లువురు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు ఇప్పుడు ఫిట్ నెస్ మంత్రాన్ని జ‌పిస్తున్నారు. గ‌తానికి భిన్నంగా వారు ఫిట్ గా ఉండాల‌నుకుంటున్నారు. భారీ కాయంతో క‌నిపించ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని నేత‌లు.. స్లిమ్ గా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు.

పెరుగుతున్న వ‌య‌సుతో పాటు.. అంత‌కంత‌కూ పెరుగుతున్న ప‌ని ఒత్తిడికి త‌గ్గ‌ట్లుగా ఆహార‌.. వ్యాయామంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వారు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వారు ఫుడ్.. ఫిట్ నెస్ విష‌యంలో ప‌క్కాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

విందుల‌కు వెళ్లినా.. అక్క‌డి వారిని ప‌లుక‌రించ‌ట‌మే కాదు.. డిన్న‌ర్ చేయ‌టానికి మాత్ర‌మ మొగ్గు చేప‌టం లేదు. పెరిగే వ‌య‌సును క‌నిపించ‌కుండా ఉండేందుకు వీలుగా ఆహారం తీసుకునే విష‌యంలో నిబంధ‌న‌ల్ని ప‌క్కాగా ఫాలో అవుతున్న వారు.. క్ర‌మ‌ప‌ద్ద‌తిలో వ‌ర్క్ వుట్స్ చేస్తున్న వారికి కొద‌వ లేదు.

ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ ఎప్పుడు ప‌డితే అప్పుడు.. ఏది ప‌డితే అది తినేందుకు గులాబీ నేత‌లు స‌సేమిరా అంటున్నార‌ట‌. నూనె.. వేయించిన వ‌స్తువులు..నాన్ వెజ్ విష‌యంలో వారు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. ఇంటి భోజ‌నం.. అది కూడా ముందుగా డిసైడ్ అయిన ఫుడ్ ప్లాన్ ను ప‌క్కాగా ఫాలో అవుతున్నారే త‌ప్పించి.. న‌చ్చింది న‌చ్చిన‌ట్లుగా తిన‌టానికి మ‌క్కువ చూపక‌పోవ‌టం విశేషంగా చెప్పాలి.

బ‌రువు పెర‌గ‌కుండా ఉండేందుకు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న టీఆర్ ఎస్ ప్ర‌ముఖులు.. అవ‌స‌ర‌మైతే వ‌ర్క్ వుట్ల‌కు టైం కేటాయించ‌టానికి సైతం వెనుకాడ‌టం లేదు. ఎవ‌రి దాకానో ఎందుకు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్‌ లో ఉంటే ఉద‌యం పూట గంట పాటు త‌ప్ప‌నిస‌రిగా స్విమ్మింగ్ చేయ‌టం ప‌క్కా అని చెబుతున్నారు. ఆయ‌నే కాదు.. ప‌లువురు నేత‌లు ఇప్పుడు వ‌ర్క్ వుట్స్ చేస్తున్నారు. ఉద‌యం వేళ‌లో జాగింగ్ చేస్తున్నారు.

క్ర‌మం త‌ప్ప‌ని వ్యాయామంతో పాటు.. తీసుకునే ఫుడ్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌ల్ని పాటించ‌టం గమ‌నార్హం. మంత్రులు హ‌రీశ్‌.. ఈటెల‌.. జోగు రామ‌న్న‌.. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వ‌ర్ లాంటి నేత‌ల‌తో పాటు మ‌రికొంద‌రు మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని ఇంటి ద‌గ్గ‌ర నుంచే తెప్పించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌ధ్యాహ్నం భోజ‌నం వ‌దిలేసి.. జ్యూసులు.. మ‌జ్జిగ‌ల‌తో ఉండిపోతున్న నేత‌లు లేక‌పోలేదు. ఎంపీ వినోద్‌ కుమార్ మ‌ధ్యాహ్నం భోజ‌నం చేయ‌కుండా ఎక్కువ‌గా మ‌జ్జిగ‌తో స‌రిపెట్టుకుంటున్నారు. మ‌ధ్యాహ్న నిద్ర‌కు టైం కేటాయించ‌ని నేత‌లు.. రాత్రి వేళ‌ల్లో హెవీ ఫుడ్ కు నో చెప్పేస్తున్నారు.

ఇక‌.. తెల్ల‌న్నం తినేకంటే బ్రౌన్ రైస్ మీద‌.. కాదంటే రెండు చ‌పాతీలు.. నాలుగు పండ్ల ముక్కుల‌తో మ‌మ అనిపించ‌టం క‌నిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొంద‌రు గులాబీ నేత‌లు అందం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్ట‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌ర‌చూ టీవీ ఛాన‌ళ్ల‌లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున చ‌ర్చ‌ల్లో పాల్గొనే ఎమ్మెల్సీ ఒక‌రు త‌ల‌పై విగ్ లేకుండా వెళ్ల‌టం లేదు. అంతేకాదు.. ముఖం మీద మ‌డ‌త‌లు క‌నిపించ‌కుండా ఉండేందుకు కొంద‌రు ప్ర‌త్యేక దృష్టిని పెడుతున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రో విశేషం ఏమిటంటే.. గ‌తంలో మాదిరి కాకుండా చాలామంది గులాబీ నేత‌లు జీన్స్.. క‌ల‌ర్ ష‌ర్టులు వేసుకోవ‌టానికి సైతం వెనుకాడ‌టం లేద‌ట‌. కాకుంటే.. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాకుండా ఫారిన్ టూర్ల‌లో ఇలా ఉంటున్న‌ట్లు చెబుతున్నారు. మొత్తానికి ఆరోగ్యం విష‌యంలో గులాబీ నేత‌ల ప్ర‌త్యేక శ్ర‌ద్ద ఇత‌ర పార్టీ నేత‌ల్లోనూ ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు చెబుతున్నారు.