Begin typing your search above and press return to search.
గులాబీ నేతలైతే చాలు.. అడ్డుకుంటున్నారే
By: Tupaki Desk | 13 Nov 2015 1:23 PM GMTవరంగల్ ఉప ఎన్నిక ఏమో కానీ.. గులాబీ దళానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ నేతలకు ప్రజల నుంచి వస్తున్న నిరసన సెగలు బెదురు పుట్టిస్తున్నాయి. ఒకరో.. ఇద్దరో కాకుండా పలు సమస్యల్ని తెరపైకి తీసుకొచ్చి.. ప్రచారానికి వచ్చిన నేతలకు తమ డిమాండ్ లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఇప్పటికే పలువురునేతలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైతే.. తాజాగా ఒక్క శుక్రవారం నాడే.. పలువురు నేతలకు నిరసనలకు సెగ తగిలింది. శుక్రవారం ఒక్కరోజే ప్రజల నుంచి నిరసన సెగ ఎదుర్కొన్న నేతల్లో మంత్రి హరీశ్ రావు.. కేటీఆర్.. ఎంపీ వినోద్ లతో పాటు పద్మా దేవేందర్ రెడ్డిలు ఉన్నారు. పలు సమస్యల్ని నేతల దృష్టికి తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.