Begin typing your search above and press return to search.
టీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి అయిదుగురు జంప్?
By: Tupaki Desk | 9 Sep 2018 10:04 AM GMTకేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించి షాకిచ్చారని అంతా అనుకుంటున్న వేళ టిక్కెట్ రానివారిలో అయిదుగురు కీలక నేతలు టీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి రెడీఅవుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు ఇప్పటికే అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కగా మరికొందరు కూడా తమ సన్నిహితుల వద్ద మండిపడుతున్నారు. దీంతో కేసీఆర్ తరహాలోనే దూకుడుగల నేతగా పేరున్న కాంగ్రెస్ నేత రేవంత్ ఈ అసంతృప్తి వాసన పసిగట్టి వారిని కాంగ్రెస్ లోకి తెచ్చి కోరిన స్థానం ఇప్పిస్తానంటూ డీల్ చేస్తున్నారట. మరో రెండు రోజుల్లో రాహుల్ గాంధీ మానసరోవర్ యాత్ర ముగించుకుని దిల్లీ రానుండడంతో ఆయన్ను కలిసేందుకు రేవంత్ దిల్లీ వస్తున్నారు. ఆయనతోపాటే ఈ నేతల్లో కొందరు రావొచ్చని.. వారికి ఉత్తమ్‌తో సంబంధం లేకుండా టికెట్ ఇప్పించే బాధ్యత రేవంత్ తీసుకుంటున్నారని టాక్.
టికెట్ రాకపోవడంతో కొండ సురేఖ ఇప్పటికే తిరుగుబాటుచేసి కేసీఆర్ - ఆయన కుమారుడు కేటీఆర్ లపై ఆరోపణలు చేసింది. కొండా సురేఖ - ఆమె భర్త మురళిలు వరంగల్ జిల్లాలోని రెండు కీలక సామాజికవర్గాలకు చెందినవారు కావడంతో మూడు నియోజకవర్గాలను వారు ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉంది. దీంతో వారిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే పనిలో రేవంత్ ఉన్నట్లు టాక్. వారి సహాయంతో వరంగల్ జిల్లాలో మూడు సీట్లు గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన రాహుల్ కు వివరించేలా లెక్కలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇక మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చేలా ఉండడంతో మైనంపల్లి కూడా టీఆరెస్ ను వీడే యోచనలో ఉన్నారట. అలాగే మైనంపల్లికి టికెటొస్తే కనకారెడ్డి గులాబీకి గుడ్ బై చెప్తారట. అసలు మొన్న ప్రగతి నివేదన సభ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలే వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెప్పాయి. అలాగే... కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట.
ఇక ఖానాపూర్ టీఆర్ ఎస్ అభ్యర్థిగా రేఖానాయక్ పేరు ప్రకటించడంపై మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆయనను ఇప్పటికే రేవంత్ సంప్రదించారట. ఖానాపూర్ నుంచి ఆయన పోటీ చేస్తే రేఖా నాయక్ గెలుపు కష్టమే.
మరోవైపు దానం నాగేందర్ కూడా కేకే రాజకీయాన్ని తట్టుకోలేక మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. అయితే.. ఆయన ఉత్తమ్ ద్వారా రాయబారాలు నెరుపుతున్నట్లు టాక్. మాజీ మంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కూడా కారు దిగి కాంగ్రెస్ రూట్లోకే రానున్నట్లు తెలుస్తోంది.