Begin typing your search above and press return to search.
అమిత్ షాను ఆటాడుకోనున్న గులాబీ దళాలు!
By: Tupaki Desk | 18 Sep 2016 6:42 AM GMTకేంద్రంలోని మోడీ సర్కారుతో తెరాస అప్రకటిత స్నేహ బంధాన్ని కొనసాగిస్తూనే ఉండవచ్చు గాక.. కానీ అంతమాత్రాన వారు కేసీఆర్ మీద ఈగ వాలితే సహిస్తారని అనుకోవడం మాత్రం భ్రమ. ఏదో రాష్ట్రంలో ఉన్న భాజపా నాయకులు తమ మనుగడ కోసం ప్రభుత్వ పరిపాలన మీద అడపాదడపా విమర్శలు గుప్పిస్తూ ఉంటే చూసీ చూడనట్లుగా పోతున్నారు గానీ.. సీరియస్ గా కేసీఆర్ ను - తెరాసను నిందిస్తే సహించేంత సహనంతో మాత్రం వారు లేరనేది తెరాస వర్గాల్లో చర్చ. అందుకే .. వరంగల్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భాజపా నిర్వహించిన వేదికమీద నుంచి అమిత్ షా సంధించిన విమర్శలకు ఘాటుగానే జవాబివ్వాలని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి.
వరంగల్ లో భాజపా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. ఏదో తాము అధికారంలోకి వస్తే.. అధికారికంగా నిర్వహిస్తాం అనే ప్రకటన వరకు ఆయన పరిమితం అయిఉంటే బాగుండేదని.. అలా కాకుండా.. కేసీఆర్ సర్కారు మజ్లిస్ కు భయపడుతున్నదంటూ.. వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రం సహించకూడదని వారు భావిస్తున్నారట.
అమిత్ షా తెరాస గురించి ప్రత్యేకించి కేసీఆర్ గురించి చేసిన విమర్శలకు ఘాటుగానే జవాబివ్వాలని, కేంద్రంతో మెతక వైఖరి అవలంబిస్తున్నందున వారు ఏం అన్నా వినబోయేది లేదని నిరూపించాలని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయిట. అమిత్ షా విమర్శలకు నేరుగా కేసీఆర్ సమాధానం ఇవ్వకుండా, స్పందించకుండా ఇగ్నోర్ చేయాలని, అలాగే.. ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా మొత్తం అమిత్ మీద ఎదురుదాడి చేయించాలని భావిస్తున్నారట. తమ మీద వచ్చిన విమర్శలకు ఎదురుదాడులు చేయడంలో.. తెరాస నాయకులు చాలా చాలా యాక్టివ్ గానే ఉంటుంటారు. చూడబోతే ఇప్పుడు కూడా అదే జరిగేలా కనిపిస్తోందని జనం అనుకుంటున్నారు.