Begin typing your search above and press return to search.
లోగుట్టు: కేసీఆర్ కోసం ఏళ్లైనా ఎదురుచూపులే.!
By: Tupaki Desk | 23 July 2019 4:45 AM GMTఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఎన్నో ఆటుపోట్లు.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూశారు కేసీఆర్. అందుకే ఒక నిర్ణయాన్ని కేసీఆర్ ఓ పట్టాన తీసుకోరని అంటుంటారు. ఇప్పటికీ ఆయన అంతే అని కేసీఆర్ తో పనిచేసిన టీఆర్ ఎస్ సీనియర్లు చెబుతుంటారు. నిర్ణయం తీసుకుంటే మాత్రం జెట్ స్పీడుతో పరిగెత్తిస్తారట.. ఎందుకంటే అడ్డుకోవడానికి ఎంతో మంది కాచుకు కూర్చుంటారు కదా.. అదీ కేసీఆర్ పనితీరు..
ఇప్పుడు కేసీఆర్ జాప్యం టీఆర్ ఎస్ లోని ఆశావహుల ఫీజులు ఎగిరిపోయేలా చేస్తోంది. ఈ పరిణామం పార్టీ ఎమ్మెల్యేలదే కాదు.. స్వయానా ఆయన కుమారుడు కేటీఆర్ - అల్లుడు హరీష్ ల పరిస్థితి కూడా ఇదేనట..
తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించకుండా కేసీఆర్ నాన్చారు. ఎన్నో విమర్శలు వచ్చాక రెండునెలలకు గానీ 10మందిని తీసుకున్నారు. ఇందులో హరీష్ - కేటీఆర్ లేరు. పాలనను పరుగులు పెట్టించిన ఈ ఇద్దరు లేక వారు చేపట్టిన మంత్రి వర్గ శాఖలు స్తబ్దుగా ఉన్నాయట.. బయట కూడా వీరిని ఇప్పుడు పట్టించుకోవడం లేదట.. ఇక నామినేటెడ్ - ఇతర మంత్రి పదవులు ఆశిస్తున్న వారు కూడా కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఎందుకంటే ఈ విషయంలో కేసీఆర్ ను గట్టిగా అడిగే ధైర్యం కేటీఆర్ కే లేదని పార్టీల్లో గుసగుసలు వినిపిస్తుంటాయి.
ఈ నేపథ్యంలో కేసీఆర్ మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు..? ఎప్పుడు పదవులు భర్తీ చేస్తారో తెలియక ఆశావహులు... ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి ఫిరాయించి మంత్రి పదవులు ఆశిస్తున్న సబితా ఇంద్రారెడ్డి.. గండ్ర వెంకటరమణ రెడ్డి లాంటి వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరు కేసీఆర్ ను కలిసి చెప్పే ధైర్యం లేక కేటీఆర్ ను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారట.. కానీ ఆయనకే పదవి లేదు.. ఇక ‘నాన్నా’రును ఏం అడుగుతారు. ఆగండి అని సమాధానం వచ్చిందని పార్టీలో నేతలు సన్నిహితుల వద్ద వాపోతున్నారట..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి డిసెంబర్ కు ఏడాది. ఇప్పుడు మూఢాలు. దసరా తర్వాత ముహూర్తాలట.. కార్తీక మాసంలో మంచి ముహూర్తాలుంటాయి. అప్పుడు విస్తరిస్తే అంటే నవంబర్ లో కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారని టాక్. దీన్ని బట్టి మంత్రులుగా చేరినా ఒక ఏడాది హరీ అన్నమాట.. మంత్రియోగం లేక కేటీఆర్, హరీష్ లు కూడా ఏడాది పాటు ఉగ్గబట్టి ఉన్నారన్నమాట..
తొలి తెలంగాణ ప్రభుత్వంలోనూ మంత్రులుగా తీసుకున్నాక విస్తరించడానికి మార్చడానికి కేసీఆర్ ధైర్యం చేయలేదు. ఏపీలో చంద్రబాబు అలానే విస్తరించి అసమ్మతి తెచ్చుకున్నాడని కేసీఆర్ ఆ సాహసానికే పోలేదు. ఇప్పుడు కూడా ఈ సామాజిక సమీకరణాలు - వలస నేతలు - మహిళా - ఎస్టీ కోటా తెగే యవ్వారం కాకపోవడంతో కేసీఆర్ జాప్యం చేస్తున్నారట.. దీంతో కళ్లు కాయలు కాసి పండ్లు అయ్యే దాకా ఆశావహులు ఎదురుచూస్తున్నారట.. అదీ సంగతీ..!