Begin typing your search above and press return to search.

బాబు రావాలి... తెలంగాణ‌లో తిర‌గాలి!

By:  Tupaki Desk   |   24 Nov 2018 6:45 AM GMT
బాబు రావాలి... తెలంగాణ‌లో తిర‌గాలి!
X
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు - కార్యకర్తలు ఉత్సాహంగా - ఉల్లాసంగా ఉన్నారు. ఆనందంగా ఉన్నారు. ఆ‌‌హ్లాదంగా ఉన్నారు. ఏందిద‌నుకుంటున్నారా...? ఏమీలేదు మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యం కావడమే భాగం కావడమే వారి ఆనందానికి - ఉత్సాహానికి కారణం అంటున్నారు. అదేమిటి తెలుగుదేశం - కాంగ్రెస్ కలిస్తే ఆ కూటమి బలంగా ఉండాలి కదా... అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు - కార్యకర్తలు ఎందుకు ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నారా?. ఇక్కడే అసలు కిటుకుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పట్ల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఆయన తెలంగాణాను అడ్డుకున్నారనే కోపం ఉంది. ఈ కోపం అసహనంతోనే గతంలో తెలుగుదేశం నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ఆ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ తో కలవడంతో తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది.

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే తమకు అంత మంచిదని - తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు - కార్యకర్తలు భావిస్తున్నారు. తెలంగాణ ఇవ్వకూడదంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పలు ప్రాజెక్టులను నిలిపి వేయాలంటూ కేంద్రానికి లేఖలు రాయడం తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ కు పరిమితమైన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ తో కలిసి తెలంగాణలో పెత్తనం చెలాయించేందుకు రావడం అసహ‌నానికి గురి చేస్తోంది. తెలంగాణ ప్రజలలో చంద్రబాబు పట్ల ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆశిస్తోంది. తెలంగాణలో చంద్రబాబు - తెలుగుదేశం నాయకులు ఎంత ఎక్కువ తిరిగితే తమకు అంత కలసి వస్తుందనే భావన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులలో ఎక్కువగా ఉంది. అందుకే వారంతా బాబు రావాలే....కూటమి పోవాలే అని అనుకుంటున్నారు.