Begin typing your search above and press return to search.
ఇది తిరుగులేని తీర్పు!
By: Tupaki Desk | 11 Dec 2018 6:03 AM GMTఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూపిన క్షణం రానే వచ్చింది. గత శుక్రవారం నుంచి అత్యంత ఉత్కంఠతో అటు రాజకీయ నాయకులు - తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈ రోజే కౌటింగ్ - ఉదయం 8 గంటల నుంచే అటు ప్రజలు - ఇటు నాయకులు అందరూ రిమోట్లు చేత పట్టుకుని తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌటింగ్ మొదలైయింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించడం మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. . మొదటి రౌండ్ నుంచే కారు తన జోరందుకుంది. 11గంటల సమయానికి కారు 93 స్దానాలలో ముందంజలో ఉన్నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ముందు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె. చంద్రశేఖర రావు చెబుతున్నట్లు కారు తన జోరు పెంచి 100 స్దానాలు గెలిచే అవకాశం లేకపోలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి ఎత్తులు పారలేదు. తెలంగాణ మళ్లీ పాగా వేయలన్న నారా చంద్రబాబు నాయుడి ఆశలు అడియాశలుగానే మిగలనున్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. ఏ ఎండకు ఆ గొడుగును పట్టే చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు నమ్మలేదని తేటతెల్లమవుతోంది. అంతే కాకుండా చివరి వరకూ కూడా కూటమిలో కుమ్ములాటల వలన ప్రజలకు ప్రజాకూటమి ఒక స్పష్టత ఇవ్వడంలో విఫలమయ్యిందని అంటున్నారు. ఇకపోతే సెట్టిలర్లు కూడా తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టడం ఒక విశేషం. హైదారబాదులో సెటిలైన ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక పుట్టిల్లులానే భావిస్తున్నారు.... ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చి - చివరికి అత్తవారింటిలోనే సెట్టిలవుతుంది...అత్తవారు ఎన్ని అవమానాలు చేసినా కూడా.. అత్తవారి పరువు కాపాడడానికే ప్రయత్నిస్తుంది.. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సెట్టిలర్లు తెలంగాణను తమ అత్తవారిల్లుగానే భావించారు. అందుకే గత మున్సిపల్ ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టారు. చివరికి ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే ప్రజాకూటమి జిమిక్ లు - ఎత్తులు పనిచేయలేదు. ప్రజాకూటమి మొత్తంగా విఫలమయ్యినట్లే ఉంది.