Begin typing your search above and press return to search.

కారు జోరుకు కాంగ్రెస్ 'సీనియర్ల ఖేల్ ఖతం..

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:57 AM GMT
కారు జోరుకు కాంగ్రెస్ సీనియర్ల ఖేల్ ఖతం..
X
కారు జోరుకు కూటమి కకావికలం అవుతోంది. కేసీఆర్ నమ్మకమే గెలిచేలా కనిపిస్తోంది. ఆరంభ ఫలితాల్లో మహాకూటమి చతికిలపడింది. టీఆర్ఎస్ కు తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం కనపడుతోంది. మేజిక్ ఫిగర్ 60 కంటే ఎక్కువే స్థానాలు సాధించేలా టీఆర్ఎస్ తొలి నాలుగు రౌండ్లు ముగిసేసరికి కనిపిస్తోంది.

కాంగ్రెస్, టీడీపీ నుంచి పోటీచేసిన హేమాహేమీలు వెనుకబడడం కారు జోరుకు అద్దం పడుతోంది. టీడీపీకి అడ్డా అని భావించి ఏపీ సీఎం చంద్రబాబు, బాలక్రిష్ణ లాంటి హేమాహేమీలు ప్రచారం చేసిన కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని వెనుకబడడం అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఇక్కడ ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్నా గులాబీ పార్టీ మెజార్టీ సాధిస్తుండడం సంచలనంగా మారింది. దీనిబట్టి టీఆర్ఎస్ కు అందరూ బలంగా నమ్మారని అర్థమవుతోంది.

కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్న రేవంత్ రెడ్డి కొడంగల్ లో వెనుకబడడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఎంతో బలమైన నేతగా ఉన్న ఆయన మొదటి రౌండ్లలో వెనుకబడ్డారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అయిన జానారెడ్డి - డీకే అరుణ - కొండా సురేఖ - దామోదర రాజనర్సింహ - టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావులు వెనుకడిపోవడం కాంగ్రెస్ కూటమిని షాక్ కు గురిచేస్తోంది.

ఉదయం 10.30వరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో టీఆర్ ఎస్ 75 స్థానాల వరకూ గెలిచేటట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి 22 స్థానాలకు పరిమితమయ్యే సూచనలున్నాయి. బీజేపీ 3 స్థానాల్లో గెలవొచ్చు.