Begin typing your search above and press return to search.
మూడూ టీఆరెస్ ఖాతాలోనే
By: Tupaki Desk | 9 March 2016 6:21 AM GMT టీఆరెస్ పార్టీ మరోసారి తన హవా చాటుకుంది. ఖమ్మం - వరంగల్ కార్పొరేషన్లు... అచ్చంపేట నగరపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలోని మొత్తం 20 వార్డులనూ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయగా... ఖమ్మం - వరంగల్ కార్పొరేషన్లలో సగం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుని విజయం ఖరారు చేసుకుంది.
అచ్చంపేటలో మొత్తం 20 వార్డులకు గాను అన్ని వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ప్రజలు ఏకపక్ష తీర్పు ఇవ్వడంతో ప్రతిపక్షాలకు స్థానం లేకుండాపోయింది. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికొస్తే అక్కడా గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 58 స్థానాలకు గాను 40 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో వరంగల్ కార్పొరేషన్ ను టీఆర్ ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆరెస్ జోరు ఆగలేదు. మొత్తం 50 స్థానాలకు గాను ఇప్పటివరకు ఫలితాలు వెలువడిన స్థానాల్లో 30 చోట్ల టీఆర్ ఎస్ గెలిచింది. దీంతో అక్కడా ఖమ్మంలోనూ టీఆరెస్ విజయం ఖరారైపోయింది.