Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ మేనిఫెస్టో విడుద‌ల‌..24 ముఖ్యాంశాలు

By:  Tupaki Desk   |   2 Dec 2018 4:47 PM GMT
టీఆర్ ఎస్ మేనిఫెస్టో విడుద‌ల‌..24 ముఖ్యాంశాలు
X
పోలింగ్‌ కు గ‌డువు స‌మీపిస్తున్న స‌మ‌యంలో టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుద చేసింది. టీఆర్ ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు పరేడ్ గ్రౌండ్‌ లోని ఆశీర్వాద సభలో టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ... 2014లో మనం మేనిఫెస్టో విడుదల చేసుకున్నాం. మెనిఫెస్టోలో పెట్టుకున్న అంశాల కాకుండా మేనిఫెస్టోలో లేని 73 అంశాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందుబాటులోకి తీసుకొచ్చుకున్నాం. ఈ ఎన్నికల్లో కూడా మనం మేనిఫెస్టోను అన్ని రకాల ప్రజల కోరికలు నెరవేర్చుకునేలా రూపొందించుకున్నాం. ప్రజల ఎజెండాను మేనిఫెస్టోలో రూపొందించుకున్నాం. అన్ని సంఘాల విజ్ఞప్తులు స్వీకరించి మేనిఫెస్టోను తయారు చేసుకున్నాం. మేనిఫెస్టో అనేది నిరంతర ప్రక్రియ. ప్రజా సంక్షేమం కోసం రూపొందించుకున్న మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు.

2018ఎన్నికల టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో -ముఖ్యమైన హామీలు

1.అన్ని రకాల ఆసరా పెన్షన్లు రూ.1000నుండి రూ.2016లకు పెంపు.

వికలాంగులకు ఆసరా పెన్షన్లు రూ.1500నుండి రూ.3016లకు పెంపు.

బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ డేట్ ను 2018వరకు పొడగింపు

2.వృద్దాప్య పెన్షన్ అర్హత వయస్సును 65 ఏళ్ల‌ నుంచి 57 ఏళ్ల‌కు తగ్గింపు

3.నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016భృతి

4.ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం యధాతదం

సొంత ఇంటి స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల నుండి రూ.6లక్షల వరకు సాయం అందించడం

5.రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ.8వేల నుండి రూ.10వేలకు పెంపు

6.రైతులకు రూ.1లక్ష వరకు పంట రుణాలు మాఫీ

7.రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి

8.ఎస్సీ ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది

9.చట్ట సభల్లో బీసీలకు 33%,మహిళలకు 33%రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పోరాడుతుంది

10.ఎస్టీలకు 12% - మైనారిటీలకు 12% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పోరాడుతుంది

11.ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుండి ఆమోదం రావడం కోసం టీఆర్ ఎస్ పోరాటం చేస్తుంది

12.వివధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది

13.రెడ్డి కార్పోరేషన్ - వైశ్య కార్పోరేషన్ తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

14.వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టీఆర్ ఎస్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది

15.అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుతుంది

16.రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు.ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది. ఈ యూనిట్లు తయారుచేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది

17.కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తుంది

18.ప్రభుత్వ ఉద్యోగులను సబబైన సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది

19.ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58నుండి 61సం.లకు పెంపుదీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచడం జరుగుతుంది

20.పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.

21.అటవీ ప్రాంతాల్లోని గిరిజన - గిరిజనేతర రైతుల భూవివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులను కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది.వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను అందిస్తుంది

22.బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది

23.సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇస్తుంది

24.హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది.