Begin typing your search above and press return to search.
మునుగోడు యుద్ధం : వంద మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అక్కడే...
By: Tupaki Desk | 6 Sep 2022 2:30 AM GMTమునుగోడు ఉప ఎన్నిక వచ్చే నెలాఖరులో జరుగుతుంది అని అధికార టీయారెస్ అంచనా వేస్తోంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలాఖరులో రావచ్చు అని భావిస్తున్నారు. దాంతో మునుగోడు లో గెలుపు కోసం అద్భుతమైన యుద్ధ తంత్రాన్ని రూపొందించింది గులాబీ పార్టీ. మునుగోడుని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని టీయారెస్ గట్టిగా సంకల్పించింది. ఇప్పటికే వరసగా 2020లో దుబ్బాక, 2021లో హుజూరాబాద్ లను బీజేపీకి కోల్పోయిన టీయారెస్ మునుగోడుని వదులుకుంటే ఇక కష్టమే అన్న అంచనాకు వచ్చింది.
పైగా ఇది సెమీ ఫైనల్స్ గా కూడా భావిస్తోంది. 2023 చివరలో తెలంగాణాకు షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మునుగోడు దానికి ముందు జరిగే చిట్ట చివరి ఎన్నిక. దీని తరువాత ఇక ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే లేవు. దాంతో మునుగోడు బరిలో ఎవరి విజయ ఢంకా మోగిస్తే వారి వైపే జనాలు ఉన్నారన్న సంకేతం, ఒక సందేశం తెలంగాణా యావత్తు సమాజానికి వెళ్ళే అవకాశం ఉంది. అందువల్లనే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేయించి మరీ బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. ఆగస్ట్ 21న మునుగోడులో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనకు కాషాయ కండువా కప్పి బీజేపీ తీర్ధం ఇప్పించారు.
మునుగోడుని బీజేపీ తెలంగాణాలో అధికార పీఠానికి దగ్గరి దారిగా భావిస్తోంది. ఇక్కడ గెలిస్తే రేపు తెలంగాణా పీఠం తమదే అని గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే బీజేపీని మునుగోడులో ఎట్టి పరిస్థితులలో నిలువరించాలన్న ఉద్దేశ్యంతో టీయారెస్ బలమైన వ్యూహాన్నే పన్నుతోంది. ఏ విధంగా చూసినా ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు అని టీయారెస్ పట్టుదలకు పోతోంది.
అందుకే మునుగోడు యుద్ధ తంత్రాన్ని ముఖ్యమంత్రి టీయారెస్ అధినేత కేసీయార్ స్వయంగా రూపొందించారు. మునుగోడు మిషన్ పేరిట రానున్న యాభై రోజుల పాటు ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వందమందిని మొత్తం మునుగోడులో దింపడం ద్వారా మొత్తానికి మొత్తం రెండు లక్షల మంది ప్రజలను విస్తృతంగా కలిసి ఓటుని తమ వైపు మళ్ళించుకోవాలని టీయారెస్ భారీ యాక్షన్ ప్లాన్ ని రూపొందించింది.
ఇదిలా ఉండగా టీయారెస్ కి 103 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో వందమందిని ఈ నెల 15 నుంచి మునుగోడులో దింపాలని ప్రణాళికను రూపొందించింది. వీరంతా మునుగోడు నియోజకవర్గంలో వార్డుల వారీగా విడిపోయి తమకు అప్పగించిన బాధ్యతలను చేపడతారు. వీరంతా గ్రామ గ్రామానా తిరిగి ప్రజలతో నేరుగా సంభాషిస్తారు. ఇంటింటికీ వెళ్ళి మరీ టీయారెస్ చేసిన అభివృద్ధి కార్యక్ర్మాలు వివరిస్తారు. టీయారెస్ కి ఎందుకు ఓటేయాలన్నది వారు వివరించి చెబుతారు.
ఇక మునుగోడులో టీయారెస్ తన అభ్యర్ధిని ఇంకా ప్రకటించలేదు. తొందరలో అభ్యర్ధిని ప్రకటిస్తారు అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా తన అభ్యర్ధిని పెట్టలేదు, త్రిముఖ పోటీగా సాగే మునుగోడు పోరులో కచ్చితంగా టీయారెస్ గెలిచి తీరుతుంది అని గులాబీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక చూతే రెండు ఉప ఎన్నికలను వరసగా గెలుచుకున్న జోరులో బీజేపీ ఉంది. ఇక కాంగ్రెస్ తీసుకుంటే ఇప్పటి దాకా జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లోనూ భారీ ఓటమిని తెచ్చుకుంది.
హుజూర్ నగర్, నాగార్జునసాగలలో ఆ పార్టీ ఓడింది. దాంతో ఈసారి అయినా గెలిచి తీరాలని చూస్తోంది. పైగా మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. బలం కూడా ఉంది. దాంతో ఆ పార్టీ కూడా పట్టుదలగా ఉంది. మరి త్రిముఖ పోటీలో ఎవరు విజేత అన్నది చూడాల్సి ఉంది. టీయారెస్ మాత్రం కచ్చితమైన ప్రణాళికలతో మునుగోడు యుధ్దానికి రెడీ అవుతోంది అని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.