Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ లో ఆ ఆలోచనే లేదట
By: Tupaki Desk | 1 Nov 2016 4:41 PM GMTతెలంగాణలోని రాజకీయవర్గాల్లో - కొందరు టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఇటీవల వినిపిస్తున్న మాట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 సార్వత్రిక సమరం కంటే ముందే ఎన్నికలకు వెళతారని. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వేగంగా కసరత్తు చేస్తున్నారని టాక్ సారాంశం. అయితే టీఆర్ ఎస్ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుతారమూ ఇష్టపడట్లేదు. అలాంటి ఆలోచన గానీ - చర్చ గానీ తమకు లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నారు.
అధికార టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీలోని ముఖ్యనేత ఒకరు మీడియాతో అంతర్గత సంభాషణల్లో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతుందన్న ప్రచారాన్ని ప్రతిపక్షాలు సృష్టించాయని అన్నారు. పూర్తికాలం పాలన సాగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. దీంతో 2019లోనే సాధారణ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వ - టీఆర్ ఎస్ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. వాస్తవానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన ఆలోచన ముందుగా అధికారపార్టీ నుంచే వచ్చినట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీనే విజయం సాధిస్తుందని టీఆర్ ఎస్ పార్టీ నేతలు మీడియాముఖంగా తెలిపారు. ఉపఎన్నికల సమయంలో ఆ పార్టీ నేతల ప్రసంగాలు వింటే ముందస్తు ప్రచారం వారి వల్లే వచ్చిందని తెలుస్తోంది. అదే సమయంలో కొద్దికాలం క్రితం రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవకపోవడం - అనుకున్న పనులు పూర్తిగాకపోవడంతో ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రారంభంలో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలత రానురానూ తగ్గిపోతూ వచ్చింది. వర్షాలు కురకవపోయినా, కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా - ఆదాయ మార్గాలు లేకపోయినా పరిస్థితి తారుమారయ్యే అవకాశాలుంటాయని ప్రభుత్వం ఆందోళన చెందింది. చివరిదాకా ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమైంది. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి టీఆర్ ఎస్ పార్టీ నాయకత్వం వచ్చినట్టు ఒక నాయకుడు చెప్పారు. ఇప్పుడా ఆలోచన లేదని టీఆర్ ఎస్ నేతలు అంటున్నారు.
వర్షాలు సమృద్ధిగా పడటం - చెరువులు నిండటం - మంచినీటి కొరత - కరెంట్ సమస్య లేకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత తగ్గిందని టీఆర్ ఎస్ అధినేత ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. 31 జిల్లాలను ఏర్పాటు చేసి, పార్టీలోని అసంతృప్తులను లేకుండా చేయడంతో కార్యకర్తలు కూడా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ నాయకత్వం విశ్వసిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు కూడా కేంద్రప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే టీఆర్ ఎస్ కు ఎదురే ఉండదని ఆపార్టీ నేతలు దృఢంగా విశ్వసిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేల్లోనూ అధికారపార్టీకే మొగ్గు ఉన్నట్టు తేలింది. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందనేది వారు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చివరిదాకా పాలనలోనే ఉండాలనే నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/