Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందా? గెలిపించారా?
By: Tupaki Desk | 21 March 2021 7:30 AM GMTఎన్నికలు ఏవైనా సరే.. దాని ఫలితం తనకు అనుకూలంగా మారేలా చేసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు మించిన నాయకుడు మొన్నటివరకు తెలంగాణలో లేరని చెప్పాలి. అలాంటి గులాబీ బాస్ కు గడిచిన కొద్దిరోజులుగా కాలం ఏ మాత్రం కలిసి రావటం లేదు. వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబుల్ విజయానికి మార్గంగా మారాయని చెప్పాలి.
తెలంగాణలో కేసీఆర్ పాలన మీద వ్యతిరేకత పెరిగిందని.. అలాంటివేళ.. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదన్న మాట బలంగా వినిపించింది. అయితే.. ఈ ఎన్నికల్ని ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామని దమ్ముగా చెప్పటమే కాదు.. చేసిచూపించారు గులాబీ నేతలు. దీంతో.. మొన్నటివరకు కేసీఆర్ చేతి నుంచి చేజారిన గెలుపు తాళం.. మళ్లీ ఆయన పిడికిలిలోకి వచ్చినట్లైంది.
ఇంతకూ రెండు ఎమ్మెల్సీ స్థానాల్ని కేసీఆర్ ఎలా సొంతం చేసుకున్నారు? ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. గ్రౌండ్ లెవల్లో జరిగిన కొన్ని వాస్తవాల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి టీఆర్ఎస్ నేతల్లోనూ.. క్యాడర్ లోనూ విపరీతమైన అత్మవిశ్వాసంతో పాటు.. ఎన్నికల్లో ఇట్టే గెలిచిపోతామన్న ధీమా.. తమకు తగ్గ ప్రతిపక్షం లేదన్న తీరు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణమైంది.
అంతేకాదు.. అప్పటివరకు ప్రధానంగా వినిపించినా తెలంగాణ భావోద్వేగం తర్వాతి కాలంలో మిస్ అయ్యింది. డబ్బులు కుమ్మరించటం.. సామాజిక సమీకరణాలతో ఎన్నికల్లో విజయం సాధించొచ్చన్న ధీమావారి కొంప ముంచింది. అంతేకాదు.. ఎన్నికల మేనేజ్ మెంట్ కు సంబంధించిన ప్లానింగ్ బ్లూ ప్రింట్ పక్కాగా ఉన్నా.. దాన్ని అమలు చేసే విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకునేవారు కాదు.
దీంతో.. ఓటమి పలుకరించటం అలవాటైంది. దీంతో.. గులాబీ బాస్ అలెర్టు కావటంతో పాటు.. బీజేపీకి బలం పెరిగిపోతుందన్న సోషల్ మీడియా ధీమా మీద దెబ్బ కొట్టేలా వ్యవహరించే నిర్లక్ష్యం మీద నజర్ వేశారు. గతానికి భిన్నంగా పార్టీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల్లో కొందరు సీరియస్ గా పని చేయకపోవటం కూడా గులాబీ పార్టీకి ప్రతికూలంగా పరిణగించిన పరిస్థితి. ఈ విషయాల్ని గమనించిన కేసీఆర్.. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిత్యం మానిటర్ చేసేలా.. ఎవరికి అప్పజెప్పిన పనులు.. అనుకున్నట్లే జరుగుతున్నాయా.. లేదా? అన్న విషయాల్ని ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో పంపించాల్సి ఉంటుంది. అలా పంపిన వాటిని వదిలేయకుండా క్రాస్ చెక్ చేయటం.. తప్పులు చేసిన వారిని వందల మందిలోలేపి మరీ తిట్టటం.. వారిపైన వెంటనే వేటు వేసి.. వారికి బదులుగా వేరే వారిని నియమించటం ద్వారా.. ఈ ఎన్నికలు పార్టీకి ఎంత ముఖ్యమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
దీనికి తోడు ధన ప్రవాహం.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లతో పాటు..మీడియాలో వ్యతిరేక కథనాలు రాకుండా చూసుకోవటంలోనూ ఈసారి సక్సెస్ అయ్యారు. వీటన్నింటికి మించి.. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో పార్టీ చెప్పిన గీతను దాటకుండా ఒళ్లు వంచి పని చేయటం కూడా లాభించింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా.. ఈ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులతో పాటు.. పలువురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ తరచూ మాట్లాడటం కూడా ఈ ఎన్నికను ఆషామాషీగా తీసుకోకూడదన్న సందేశం అవగతమైంది. గతంలో మాదిరి కాకుండా.. ఈసారి పార్టీ నేతల్ని నేరుగానే అధినాయకత్వం హెచ్చరించిందన్న మాట వినిపిస్తోంది. మళ్లీ ఎన్నికల్లో టికెట్ ఉండదు సుమా? అన్న మాటలు కూడా కొందరు నేతలకు చెప్పేసినట్లు చెబుతున్నారు. ఇదే.. తాజా డబుల్ విజయానికి కారణమని చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు.. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది అనే కంటే.. కేసీఆర్ దగ్గరుండి గెలిపించారనటం సబబుగా ఉంటుంది.