Begin typing your search above and press return to search.
టీఆరెస్ మాట ఒకటి.. పాట మరొకటి
By: Tupaki Desk | 24 Jan 2016 6:12 AM GMTతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించింది మొదలు సమైక్యాంధ్ర విభజన జరిగిన వరకు సీమాంధ్రులను, తెలంగాణలోని సెటిలర్లను దుమ్మెత్తిపోసిన టీఆరెస్ నేతలు ఇప్పుడు స్వరం మార్చిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లకు గురిపెట్టి టీఆరెస్ నేతలు ఇప్పుడు తియ్యని మాటలు చెబుతున్న సంగతీ తెలిసిందే. టీఆరెస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి మొదలుపెట్టి మిగతా నేతలంతా సెటిలర్లు మా ముద్దుబిడ్డలన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే.... మాటల్లో చూపుతున్న ఈ ప్రేమ పాటల్లో కనిపించడం లేదు.. అవును.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆరెస్ అభ్యర్థులు గల్లీ గల్లీ తిరుగుతూ చేస్తున్న ప్రచారంలో భాగంగా వేస్తున్న పాటల్లో మాత్రం సెటిలర్లను తిడుతున్నారు. తరిమితరిమి కొడతామంటున్నారు. అందుకు కారణం ఒకటే.... ఉద్యమ కాలంనాటి పాటలను ఇంకా వినిపిస్తుండడమే దానికి కారణం.
టిఆర్ ఎస్ క్షేత్రస్థాయి నేతలు ప్రచారంలో చూపిస్తున్న ఈ పాటల ఉత్సాహం కాస్త గులాబీ పార్టీని నష్టంచేకూర్చేలా ఉంటున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జిహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారం సమయంలో గులాబీ అభ్యర్థులు వారి అనుచరులు పాటల సీడీలతో జనంలోకి వెళ్తున్నారు. నాటి ఉద్యమ పాటలతో జనంలో స్పూర్తి నింపాలని భావిస్తున్న టిఆర్ ఎస్ శ్రేణులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహమే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారనున్నదన్న ప్రచారం సాగుతోంది. ఉద్యమం సమయంలో తెలంగాణ పాటలన్నీ ఎక్కువగా ఆంధ్రోళ్ల పాలనపైనా, ఆంధ్రోల దోపిడిపైనా సాగినవే. అంతేకాదు ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకొంటే హైదరాబాద్ లోని ఆంధ్రోళ్లను తరిమితరిమి కోడతామని పలు పాటలలో ఉన్నాయి. ఇప్పుడు అవే పాటలను టిఆర్ ఎస్ శ్రేణులు ఈ జిహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో వాడటంపైనే ఇప్పుడు గులాబీ పార్టీకి శాపంగా మారుతుందా అన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో సెటిలర్ల ఓట్లు ఎటు పోతాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
అంతేకాదు... టీఆరెస్ అగ్రనేతల మాటలో చల్లారిన చాలామంది సెటిలర్లు కూడా మళ్లీ ఈ పాటలు విని రగులుతున్నారు. ఓ పక్క అందర్ని కడుపులో పెట్టి చూసుకుంటామంటూనే మరోపక్క సెటిలర్లను దూషిస్తూ సాగుతున్న ప్రచారంలో సెటిలర్లు టీఆర్ ఎస్ అభ్యర్థులకు ఎలా ఓటు వేస్తామని అంటున్నారు. దీంతో సెటిలర్లు టీఆరెస్ ను దెబ్బతీస్తారా అన్న అనుమానాన్ని కూడా చాలామంది వ్యక్తంచేస్తున్నారు.