Begin typing your search above and press return to search.
గులాబీ న్యాయం: పేకాట.పేకాటే.పోటీ.పోటీనే
By: Tupaki Desk | 3 Oct 2015 4:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు.. చేతల మధ్య తేడా ఎంతన్నది అందరికి తెలిసిందే. మాటల్లో వినిపించే కమ్మదనం.. చేతల వరకూ వచ్చేసరికి పూర్తిగా మారిపోతుంది. ఇటీవల మరణించిన నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పి. కిష్టారెడ్డికి అసెంబ్లీలో నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆకాల మరణం తనకు తీరని లోటుగా కేసీఆర్ అభివర్ణించారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. తనకు పెద్ద దిక్కు పోయినట్లుగా చెప్పుకొచ్చారు.
మరి.. అంత మంచి సంబంధాలుంటే.. ఆయన ఆకాల మరణంతో జరిగే ఉప ఎన్నికకు.. ఆయన కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి అవకాశం కల్పించేలా పెద్దన్న పాత్రను ఎందుకు పోషించటం లేదన్నది ఒక ప్రశ్న. కిష్టారెడ్డి కుటుంబానికి అండగా నిలవటం.. ఆ కుటుంబానికి చెందిన వారు ఉప ఎన్నికల బరిలో నిలిచేలా ఎందుకు చేయటం లేదు?
తమ పార్టీకి చెందిన నేత కాకున్నా.. తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు తగ్గట్లు ఆ కుటుంబానికి పదవి దక్కేలా ఎందుకు ప్రయత్నించటం లేదన్నది ఒక ప్రశ్న.
తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా సాగుతున్న ఒక అనవాయితీకి తాజాగా జరిగే నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా తిలోదకాలు ఇవ్వనున్నారు. ఇప్పటివరకూ ఎవరైనా నేత మరణిస్తే.. ఉప ఎన్నికకు సదరు నేత కుటుంబానికి చెందిన వ్యక్తిని ఉప ఎన్నికల బరిలోకి నిలపటం.. ఆ ఎన్నికను ఎకగ్రీవం చేసేందుకు రాజకీయ పార్టీలన్నీ తోడ్పాటు ఇవ్వటం చేసేవి.
అయితే.. ఏపీలోకి ఈ మధ్యన జరిగిన ఉప ఎన్నికల్లో ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇస్తే.. తాజాగా తెలంగాణలో తెలంగాణ అధికారపక్షం ఆ సంప్రదాయానికి నీళ్లు వదలనుంది. నారాయణ్ భేడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకోవటంతో పాటు.. అభ్యర్థి విషయంలోనూ ఒక స్పష్టత వచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
నారాయణ్ ఖేడ్ పార్టీ ఇన్ ఛార్జ్ అయిన ఎం. భూపాల్ రెడ్డిని అధికారపార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలపటంపై పార్టీ వర్గాల వాదన ఏమిటంటే.. తాము అభ్యర్థిని నిలపకున్నా.. మిగిలిన పార్టీలు అభ్యర్థుల్ని పెడతాయని చెబుతున్నారు. నిజంగా కిష్టారెడ్డి అత్యంత సన్నిహితుడే అయితే.. అలాంటి సన్నిహితుడి కుటుంబానికి అండగా నిలిచేలా పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా విషయాన్ని తీసుకుంటే.. పోటీ నుంచి పార్టీలు పక్కకు వెళ్లటం పెద్ద విషయమేమీ కాదు.
కానీ.. వ్యక్తిగత అనుబంధం అనుబంధమే. పోటీ పోటీనే అన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉంది. అయినా.. సమకాలీన రాజకీయాల్లో వ్యక్తిగత ప్రేమాభిమానాలు మాటల్లోనే కానీ.. చేతల వరకూ ఉంటాయా? అంత విశాల హృదయం ఉండాలని ఆశించటం అత్యాశ అవుతుందేమో.