Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ తర్వాతి టార్గెట్ భారీగా ఉందిగా?
By: Tupaki Desk | 18 April 2016 4:15 AM GMTఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికకు అధికార టీఆర్ ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. అక్కడ పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి ఎవరన్నది ఉత్కంఠగా మారింది. కచ్చితంగా గెలిచే సీటు కావడంతో పోటీ ఎక్కువైంది. మరి అధిష్టానం ఏం చేయబోతోంది..? ఈ టార్గెట్‌ను ఎలా సాధించనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో అక్కడ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. అయితే ఈ స్థానానికి పోటీ పెట్టకుండా..ఏకగ్రీవం చేయించాలి, మళ్లీ తమ సీటును తామే పొందాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే సమయంలో గులాబీ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచి, వెంకట్ రెడ్డి కుటుంబం నుంచి గులాబీ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తే ఏకగ్రీవం అనుకుంటోంది. అయితే ఈలోపు ఖమ్మం తమ కంచుకోటగా భావిస్తున్న సీపీఎం పాలేరులో పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఏకగ్రీవం కాస్తా ఎన్నికగా మారనుంది. ఎన్నిక తప్పనిసరి కావడంతో ఇప్పుడు అభ్యర్థులపై ఆసక్తి ఏర్పడింది.
టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎన్నికల్లో తిరుగులేని విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ ఎమ్మెల్యే ఉప ఎన్నిక గులాబీ నేతలకు అందివచ్చిన అవకాశంగా కనిపిస్తోంది. ఇటీవల ఖమ్మంలో రెండు సాగునీటి ప్రాజెక్టులను ప్రకటించడమే కాకుండా వచ్చే ఏడాది నాటికి వాటిని పూర్తి చేస్తామని అధికార పార్టీ ప్రకటించడంతో ఖమ్మంలో గులాబీ పార్టీకి బలం పెరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ పార్టీ విజయం సాధించడంతో ఇక తిరుగులేదనుకుంటున్నారు. దీంతో అభ్యర్థి ఎవరైనా గెలుపు తమదేనన్న ధీమాలో గులాబీ పార్టీ ఉండడంతో...అభ్యర్థులు కూడా అదే స్థాయిలో పోటీలు పడుతున్నారు. గెలిచే టికెట్ కోసం అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు.
పాలేరు సీటు తనకు కేటాయించాలని వైసీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన గట్టు రామచంద్రరావు అడుగుతున్నారు. తన కోరికను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఖమ్మం నేతగా, వైసీపి నుంచి వచ్చిన తనకు అక్కడ కొంత పట్టు ఉందని తనకు టికెట్ ఇస్తేమంచి మెజారిటీ సాధిస్తానంటున్నారు. సాధారణ ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ నేత బేగ్ తనకు మరోసారి అవకాశం కల్పించాలంటున్నారు. పార్టీకోసం మొదటి నుంచి కష్టపడిన తనకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అవుతానంటున్నారు. ఇందుకోసం పార్టీలో ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.