Begin typing your search above and press return to search.
కొత్త ఆట - 'ఆపరేషన్ స్మాష్'
By: Tupaki Desk | 12 Dec 2015 6:46 AM GMTఆపరేషన్ ఆకర్ష్ అందరికి తెలిసిందే. మరి.. దాని అడ్వాన్స్ వెర్షన్ ఏంటి? ‘ఆపరేషన్ స్మాష్’. వినటానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. విపక్షాల్ని స్మాష్ చేయటమే లక్ష్యంగా తెలంగాణ అధికారపక్షం కొత్త ఆటకు తెర తీసింది. పోల్ మెనేజ్ మెంట్ లో సరికొత్త అధ్యాయాల్ని తయారు చేసిన గులాబీ జట్టు విపక్షాల ఉనికి అన్నది లేకుండా చేయటమే ఆపరేషన్ స్మాష్ లక్ష్యం. ఆపరేషన్ ఆకర్ష్ లో ఎన్నికల్లో గెలిచిన నేతలతో పాటు.. ప్రత్యర్థి పార్టీల్లో బలమైన నాయకులపై వల పన్నటం. మరి.. ఆపరేషన్ స్మాష్ లో అంతకు మించి అనే చెప్పాలి. ఎన్నికల బరిలో నిలిచిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని రంగంలో లేకుండా చేయటం.. ఎన్నికల్ని ఏకగ్రీవం చేయటమే కొత్త ఆట. దీని వల్ల వచ్చే లాభం ఏమిటన్నది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలెన్నో అర్థమవుతాయి.
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఆవతరించటంతో పాటు.. తిరుగులేని విధంగా అధికారాన్నితన చేతుల్లో ఉంచుకోవాలన్నది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరిక. ఇందుకు తగ్గట్లే ఆపరేషన్ ఆకర్ష్ తో పలువురు బలమైన నాయకుల్ని తన జట్టులో చేర్చుకున్న ఆయన.. ఇప్పుడు తన గేమ్ ప్లాన్ కు మరింత పదును పెట్టారు. తొలుత రాష్ట్రస్థాయి నాయకుల మీద గురి పెట్టిన కేసీఆర్.. ఈ మధ్య కాలంలో క్షేత్రస్థాయిలో కిందిస్థాయి నాయకుల్ని టార్గెట్ చేశారు. ఈ రెండింటిలోనూ సక్సెస్ అయిన కేసీఆర్.. ఇప్పుడు వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులపై గురి పెట్టారు.
స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారికి ఒక ప్యాకేజ్.. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు వేరే ప్యాకేజ్ సిద్ధం చేశారు. ఇండిపెండెంట్లగా రంగంలో ఉన్న వారికి తాత్కలిక ప్రయోజనాలు కల్పించి వారిని బరిలో లేకుండా చేయటం.. ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థులకు బరి నుంచి తప్పించి.. గులాబీ అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేశారు. వైరి పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగిన వారి మెడలో గులాబీ కండువాలు వేయటం ద్వారా ప్రత్యర్థి పార్టీల అంతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తాజా ఆపపోరేషన్ తోఎన్నికల బరిలో అభ్యర్థులు కూడా నిలుపుకోలేని దుస్థితిలోకి వైరి పార్టీలు పడిపోతాయి. ఈ మొత్తం ప్రక్రియతో.. క్యాడర్ లోనూ.. కింది స్థాయి నాయకుల్లోనూ ఆత్మస్థైర్యం దారుణంగా దెబ్బ తీయొచ్చు. తెలంగాణ రాజకీయం అంటే.. అధికారపక్షం తప్పించి మరే పార్టీ బరిలో ఉండని పరిస్థితి ఉంటుంది.
అభ్యర్థులపై వల విసరటం ద్వారా తెలంగాణ అధికార పక్షానికి కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం లభిస్తుంది. భవిష్యత్తు నాయకుల్ని తయారు చేసేది ఉద్యమాలు.. ఎన్నికలే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. సమీప భవిష్యత్తులో ఉద్యమాలు పుట్టుకు రావు. ఒకవేళ పుట్టుకొచ్చినా.. సుదీర్ఘ కాలంపాటు ఉద్యమాలకు నాయకత్వం వహించిన టీఆర్ఎస్ కు వాటిని ఎలా కంట్రోల్ చేయాలో బాగానే తెలుసు.
ఇక.. ఎన్నికల ద్వారా తయారయ్యే భవిష్యత్తు నేతల్ని దెబ్బ తీయటం అనే ఆటకు తెలంగాణ అధికారపక్షం తెర తీసింది. వారిని బరిలో నుంచి తప్పించటం ద్వారా.. భవిష్యత్త్ నేతలుగా ఎదగకుండా చేయటం.. రాజకీయంగా శక్తివంతులు కాకుండా అడ్డుకోవటంతో పాటు.. సాదాసీదా నామినేటెడ్ పదవుల్లోకి సర్దటం ద్వారా కొత్త నాయకత్వం ఎదగకుండా చేసినట్లు అవుతుంది. దీంతో.. శత్రేశేషం పూర్తి చేయటంతో పాటు.. రాజకీయ పార్టీల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే అవకాశం ఉంటుంది. సమీప భవిష్యత్తులో గులాబీ పార్టీ మినహా.. మరే ఇతర రాజకీయ పార్టీల్లోనూ క్యాడర్ లేకుండా చేయాలన్నదే తాజా ఏకగ్రీవాల గేమ్ ప్లాన్ గా చెబుతున్నారు.