Begin typing your search above and press return to search.
వైరల్ గా మారిన మల్లారెడ్డి మాటల ఆడియో క్లిప్
By: Tupaki Desk | 16 Jan 2020 8:11 AM GMTకీలకంగా మారిన మున్సిపల్ ఎన్నికల వేళ.. అధికార టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి మంత్రి మల్లారెడ్డి రూపంలో ఎదురైందని చెప్పాలి. ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు రావటమే కాదు.. వైరల్ గా మారింది. తనకు టికెట్ ఇచ్చేందుకు మంత్రి మల్లారెడ్డి తనను రూ.50 లక్షలు డిమాండ్ చేశారంటూ బోడుప్పల్ టీఆర్ఎస్ నేత రాపోలు రాములు ఆరోపించటం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఒక డివిజన్ అభ్యర్థిత్వం కోసం ఏకంగా రూ.50లక్షలు డిమాండ్ చేశారా? అన్నది ప్రశ్నగా మారింది. టికెట్ కేటాయింపులో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని.. ఆయన టికెట్లు అమ్ముకుంటున్నట్లుగా రాపోలు సదరు ఆడియో క్లిప్ లో ఆరోపించారు.
తన వర్గానికి టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. టికెట్ కేటాయింపుల విషయంలో తనకున్న అభ్యంతరాల్ని మంత్రి మల్లారెడ్డితో మాట్లాడిన రాపోలు ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతోంది. టికెట్ కేటాయింపులో ఏదో జరిగిపోతుందన్న భావనకు బలం చేకూరేలా ఈ ఆడియో క్లిప్ ఉందని చెప్పాలి.
టికెట్ కేటాయింపుల కోసం భారీగా డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారంటూ మంత్రిపై వచ్చిన ఆరోపణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. మొత్తంగా టీఆర్ ఎస్ పార్టీకి ఈ ఆడియోక్లిప్ కాస్త ఇబ్బందిని కలిగించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.