Begin typing your search above and press return to search.
వ్యూహం: నిలదీస్తే నవ్వుతూ బదులివ్వాలి
By: Tupaki Desk | 10 Nov 2015 4:17 AM GMTరింగు రోడ్డు మీద గంటకు 150కి.మీ. స్పీడుతో దూసుకుపోవాలన్న ఉత్సాహంతో బయలుదేరిన వ్యక్తికి.. రింగురోడ్డుకు వెళ్లిన వెంటనే.. విపరీతమైన వాహనాల రద్దీ ఉంటే ఏమవుతుంది? ఊహించని పరిణామానినికి ఉక్కిరిబిక్కిరి కావటంతో పాటు.. నిరాశతో నీరసం కమ్మేయం ఖాయం. అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటన్న అసంతృప్తి రగిలిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం టీఆర్ ఎస్ పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. తేలిపోయే విపక్షాలతో.. విజయం అసలు విషయమే కాదని.. మెజార్టీ మీదనే తమ దృష్టి అని చెబుతూ తెలంగాణ అధికారపక్షంగా వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దిగింది. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితిని గులాబీ బ్యాచ్ ఎదుర్కొంటోంది.
టీఆర్ ఎస్ ట్రాక్ రికార్డు చూస్తే ఒక ఆసక్తికర అంశం కనిపిస్తుంది. ఆ పార్టీ పెట్టిన నాటి నుంచి.. తాను ఎదుర్కొన్న ప్రతి ఉప ఎన్నికల్లోఆ పార్టీ తన బలాన్ని అంతకంతకూ పెంచుకుందే తప్ప.. ఎప్పుడూ ఆత్మరక్షణలో పడింది లేదు. కానీ.. ప్రస్తుత పరిస్థితి.. గతానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటివరకూ ఆ పార్టీ ఎదుర్కొన్న ఉప ఎన్నికలన్నీ ఆ పార్టీ కారణంగానే (దాదాపుగా) చోటు చేసుకున్నవే. తాజా వరంగల్ ఉప ఎన్నిక కూడా టీఆర్ ఎస్ తీసుకున్న నిర్ణయం కారణంగానే కావటం గమనార్హం. వరంగల్ నుంచి విజయం సాధించిన తమ పార్టీకి చెందిన ఎంపీ కడియం శ్రీహరిని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి కట్టబెట్టిన నేపథ్యంలో.. ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సి వచ్చింది. దీంతో.. వరంగల్ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఉప ఎన్నికలు వచ్చాయంటే చాలు.. టీఆర్ ఎస్ ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే.. జోరుగా వచ్చే వరద నీటితో ప్రాజెక్టు మొత్తం నిండి.. గేట్లు తెరిచినప్పుడు ఎంతటి ఊపు ఉంటుందో సరిగ్గా అదే స్థాయిలో ఎన్నికల్లో దూసుకెళ్లేంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తీరుకు.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తీరుకు సంబంధమే ఉండదు. తాను తీసుకొచ్చే ఉప ఎన్నికతో సెంటిమెంట్ ను.. భావోద్వేగాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లే టీఆర్ ఎస్ కు తాజాగా ఎదురవుతున్న పరిణామాలన్నీ సరికొత్త అనుభవాలే.
ఉప ఎన్నికల సమయంలో అధికారపక్షాన్ని దులిపేయటం.. సెంటిమెంట్ ను రాజేయటం లాంటివి ఉండేవి. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. విపక్షంగా ఉంటే టీఆర్ ఎస్ అధికారపక్షంగా మారింది. నిలదీయాల్సిన విపక్షాలు అధికారపక్ష దూకుడికి తట్టుకోలేని పరిస్థితి. దీనికి తోడు.. పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు సైతం అంతంతమాత్రమేనన్న భావన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు తిరుగులేదని భావించటం టీఆర్ ఎస్ పార్టీ లాంటి వాటికి పెద్ద విషయమే కాదు.కానీ.. విపక్షాలు తీసుకోవాల్సిన బాధ్యతను ప్రజలు తీసుకోవటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. గడిచిన వారంలో.. టీఆర్ ఎస్ ముఖ్యనేతలు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు నిర్వహించే సభల సందర్భంగా సాదాసీదా ప్రజలు నిలదీస్తున్న వైఖరి.. ఆ పార్టీకి సరికొత్త అనుభూతి.
ఇప్పటివరకూ అలాంటి అనుభవం టీఆర్ ఎస్ కు కొత్త. పార్టీలను తాను నిలదీయటమే కానీ.. తనను నిలదీసే పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. కానీ.. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు కాకుండా.. ప్రజలే నిలదీసే ప్రోగ్రాం పెట్టుకోవటం.. టీఆర్ ఎస్ సర్కారు మీద తమకున్న అసంతృప్తిని బాహాటంగా (ఒకరిద్దరైనా) వ్యక్తం చేయటం.. అలాంటి పరిస్థితి తరచూ చోటు చేసుకోవటం ఇబ్బందిగా మారింది. ఇలాంటి ఘటనలు కొత్తవి కావటంతో నేతలు ఎలా రియాక్ట్ కావాలన్న దానిపై అయోమయం నెలకొంది. తమకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చే నిలదీతను సమర్థంగా ఎదుర్కొనేందుకు సరికొత్త ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఉప ఎన్నిక సందర్భంగా ఎవరైనా ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తే.. అలాంటి వారిని ఎలా కంట్రోల్ చేయాలి? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. దీనిపై సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరిని.. పాలనను ప్రశ్నిస్తూ.. తమ సమస్యల్ని ప్రస్తావించే వారి విషయంలో ఏ మాత్రం సీరియస్ కాకూడదని.. అనవసరమైన రచ్చకు తావివ్వకుండా సంయమనంతో.. నవ్వుతూ సమాధానం చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిలదీతకు నవ్వుతూ బదులివ్వటం.. అనునయంగా మాట్లాడటం లాంటివి చేయటం.. ఇష్యూను ఇన్ స్టెంట్ గా క్లోజ్ చేసే విధంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. మీడియా దృష్టిని ఆకర్షించకుండా ఉండేలా చేయటంతో పాటు.. నిలదీసే వారు వేరే పార్టీకి చెందిన వారైతే.. ఆ విషయాన్ని ప్రచారం చేయాలని.. తమను బద్నాం చేయటానికి విపక్షాలు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాయన్న వాదనను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి.. వ్యూహంగా అనుకున్నది వాస్తవంలో ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.