Begin typing your search above and press return to search.
పత్తిపై ఫైర్ అవుతున్న గులాబీ దళం
By: Tupaki Desk | 15 Nov 2015 6:34 AM GMTతెలంగాణ అధికారపక్షం అలెర్ట్ అయ్యింది. వరంగల్ ఉప ఎన్నిక తాము అనుకున్నంత సులభమన్న విషయంపై పునరాలోచన పడింది. విజయంపై ధీమా కొంపముంచే అవకాశం ఉందన్న విషయాన్ని అర్థం చేసుకున్న గులాబీ దళం ఇప్పుడు మరింత సీరియస్ గా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. గెలుపు మీద ధీమాతో ప్రత్యర్థిని ఏ మాత్రం తక్కువగా అంచనా వేసినా చేదు అనుభవం తప్పదన్న విషయం అర్థం చేసుకున్న గులాబీ నేతలు ఇప్పుడు విమర్శల కత్తికి పదును పెడుతున్నారు.
ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కంటే కూడా టీడీపీ.. బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి నుంచి ఎక్కువ ముప్పు ఉంటుందని గులాబీ దళం అభిప్రాయపడుతోంది. అందుకే.. ప్రధానిని సైతం వరంగల్ ముగ్గులోకి లాగే ప్రయత్నాన్ని సిద్ధం చేసింది. మోడీ మీద విమర్శలు చేయటం ద్వారా.. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీనేనన్న విషయాన్ని టీఆర్ ఎస్ నేతలు చెప్పకనే చెప్పేశారు.
వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడి స్థానిక ప్రజల నుంచి టీఆర్ ఎస్ నేతలకు నిరసన గళం భారీగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ అధికారపక్షం ఫ్లాష్ సర్వే నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఈ ఫ్లాష్ సర్వేలోనూ.. వరంగల్ ఉప ఎన్నికను ఏ మాత్రం తక్కువగా అంచనా వేసినా ఓటమి షాక్ తప్పదన్న హెచ్చరికతో గులాబీ దళం ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. వెనువెంటనే వ్యూహాన్ని సిద్దం చేసిన టీఆర్ ఎస్ నేతలు.. దాన్ని ముమ్మరంగా అమలు చేస్తున్నారు. కేంద్ర సర్కారు తీరుపై విమర్శలు చేస్తూ.. ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న పరిస్థితి.
ఇక.. వరంగల్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పత్తిరైతులు అధికంగా ఉండటం.. వారికి గిట్టుబాటు ధర లభించక తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ అధికారపక్షం.. రైతుల కష్టానికి తాము కారణం కాదని.. ఆ పాపం మోడీ సర్కారుదేనని తేల్చి చెబుతున్నారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాల కారణంగానే పత్తి రైతులు ఈ రోజు ఇంతగా ఇబ్బంది పడుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.
టీఆర్ ఎస్ ప్రచారాన్ని గుర్తించిన బీజేపీ నేతలు ఎదురుదాడి మొదలెట్టారు. పత్తి గిట్టుబాటు ధర విషయంలో కేంద్రం దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేస్తుందని.. మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరించినట్లుగా.. తెలంగాణ రాష్ట్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేదంటూ మండిపడుతున్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేయటంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యాన్ని బయటకు రాకుండా చేసి.. ఆ సమస్య మొత్తం బీజేపీ ఖాతాలో వేసేందుకు టీఆర్ ఎస్ నేతలు సమాయుత్తమవుతున్నారు. మరోవైపు.. తమనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధిస్తున్న తెలంగాణ సర్కారుకు ధీటుగా బదులిచ్చేందుకు కమలనాథులు కత్తులు నూరుతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య రచ్చ మరింత ముదరటం ఖాయమని చెబుతున్నారు.