Begin typing your search above and press return to search.

ఆ కాంగ్రెస్ నేతలే టీఆరెస్ టార్గెట్

By:  Tupaki Desk   |   1 Nov 2018 4:54 AM GMT
ఆ కాంగ్రెస్ నేతలే టీఆరెస్ టార్గెట్
X
సీట్ల పంపకాలపై సర్దుబాటు చేసుకుని కాంగ్రెస్ పెద్దల సమక్షంలో లెక్కలు తేల్చుకోవడానికి తెలంగాణలొ మహా కూటమి పార్టీలు ముందడుగు వేస్తున్న వేళ టీఆరెస్ అధినేత కేసీఆర్ కూటమిలె అసంతృప్తిని క్యాష్ చసుకోవాలని భావిస్తున్నారట. ముందస్తు ఎన్నికలకు రావడమే ఒక తొందరపాటు చర్య.. ఆ తరువాత హడావుడిగా ఒకేసరి 105 సీట్లను ప్రకటించి మరో తొందరపాటు అగుడు వేసిన కేసీఆర్ ఇప్పుడు కొత్త వ్యూహాలతో ఆ నష్టాలను భర్తీ చేసుకోవాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే...ప్రజాకూటమి పొత్తుల్లో సీట్లు దక్కని నేతలు - సీట్లు గల్లంతైన నేతలను తెరాసలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ముఖ్యంగా టీడీపీ - తెలంగాణ జన సమితికి కొన్ని సీట్లు ఇస్తుండడంతో ఆయా చోట్ల టిక్కెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు గుర్రుమంటున్నారు. ఇప్పుడు వారిన తమవైపు ఆకర్షించేందుకు టీఆరెస్ ప్రయత్నాలు చేస్తోంది. మంత్రులు - ఎంపీలను రంగంలోకి దింపి - ఆయా నేతలతో చర్చలు జరపాలని ఆదేశాలిచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.

టీఆర్‌ ఎస్‌ ఇప్పటికే 107 నియోజకవర్గాల్లో టికెట్ల ప్రకటన పూర్తిచేయగా - ఇరవై నియోజక వర్గాల్లో అసమ్మతి ఛాయలు కనిపించినా ఒప్పించి సర్దుబాట్లు పూర్తిచేశారు. విపక్ష కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్ధులను ప్రకటించక పోగా.. టీఆర్‌ ఎస్‌ కంటే రెట్టింపు స్థాయి లో కాంగ్రెస్‌ ఆశావహులు టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని - అసంతృప్తుల పై ఇప్పటికే వలవేయాలని పార్టీ ముఖ్యులకు ఆదేశాలు వెళ్ళినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక తమకు టికెట్‌ రాకుంటే టిఆర్‌ ఎస్‌ లోకి వస్తామని కొందరు ముఖ్యనేతలు జిల్లాల్లో మంత్రులకు టచ్‌ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీపావళి తరువాత వారిపై ఆకర్షణ వల విసురుతారని తెలుస్తోంది.