Begin typing your search above and press return to search.
4,59,092 ఓట్లతో గెలిచిన టీఆర్ ఎస్
By: Tupaki Desk | 24 Nov 2015 8:22 AM GMTవరంగల్ ఉప ఎన్నిక తుది ఫలితం విడుదలైంది. ఊహించని రీతిలో అద్భుత విజయాన్ని టీఆర్ ఎస్ తన ఖాతాలో జమ చేసుకుంది. అందరి అంచనాలకు భిన్నంగా తెలంగాణలో తనకు తిరుగులేదని తెలంగాణ అధికారపక్షం తాజా అద్భుత విజయంతో తన సత్తాను చాటింది. పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారానికి భిన్నంగా.. పోలింగ్ మాత్రం ఏకపక్షంగా సాగిందన్న విషయం ఓట్ల లెక్కింపు తేల్చి చెప్పింది.
మొత్తం 22 రౌండ్ల లెక్కింపు అనంతరం టీఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్వే సత్యానారాయణ మీద 4,59,092ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత పార్టీలకు వచ్చిన ఓట్లను చూస్తే.. తెలంగాణ అధికారపక్షానికి 6,15,403 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు 1,56,315 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక.. బీజేపీ అభ్యర్థి 1,30,178 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్ ఎస్ ధాటికి కాంగ్రెస్ కనీసం రెండు లక్షల ఓట్ల అంకెను కూడా దాటకపోవటం గమనార్హం. పోటాపోటీగా ఉంటుందని భావించిన వరంగల్ ఉప ఎన్నిక.. ఏకపక్షంగా సాగిన విషయం తాజా ఫలితాల వెల్లడితో స్పష్టమైందని చెప్పొచ్చు.