Begin typing your search above and press return to search.
మోడి వ్యతిరేక గ్రూపులో టీఆర్ఎస్
By: Tupaki Desk | 10 Aug 2021 5:58 AM GMTవచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నరేంద్రమోడిని ఓడించాలని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు టీఆర్ఎస్ కూడా చేతులు కలిపింది. మోడి ఆధ్వర్యంలోని ఎన్డీయేని ఓడించటమే టార్గెట్ గా ప్రతిపక్షాల్లోని మమతబెనర్జీ, శరద్ పవార్ లాంటి నేతలు చాలా చురుకైన పాత్రను పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విపక్షాల్లోని చాలామంది నేతలను కలపటానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పెద్ద ప్లాన్ తో ముందుకెళుతున్నారు. ఇప్పటికే మమత, శరద్ తో చాలాసార్లు భేటీ అయిన ప్రశాంత్ సోనియా, రాహూల్, ప్రియాంకతో కూడా సుదీర్ఘ భేటీ జరిపారు.
ప్రశాంత్ తో భేటీలు తర్వాత మమత నిర్వహించిన రెండు భేటీలకు కాంగ్రెస్ తో పాటు చాలా పార్టీలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. తాజాగా కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బల్ ఇంట్లో జరిగిన విందు భేటీకి ప్రతిపక్షాల్లోని 12 పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, భూపీందర్ సింగ్ హూడా, ఆనంద్ శర్మ, శశిథరూర్ లాంటి నేతలతో పాటు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, డీ రాజా లాంటి అనేకమంది హాజరయ్యారు.
పై నేతలు హాజరవ్వటంలో ఆశ్చర్యం ఏమిలేదు కానీ వీరితో పాటు టీఆర్ఎస్ నేత కూడా హాజరయ్యారట. ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లోని అధికారపార్టీల నుండి కానీ ప్రతిపక్షాల నుండి కానీ నేతలు ఎవరు హాజరవ్వలేదు. తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపి ప్రయోజనాలకు నరేంద్రమోడి సర్కార్ తూట్లు పొడుస్తోంది. అయినా తెగించి మోడి వ్యతిరేక గ్రూపుతో వైసీపీ నేతలు చేతులు కలపలేదు.
రెండేళ్ళుగా కేంద్రానికి వెలుపలనుండి మద్దతిస్తున్న వైసీపీ తన వైఖరిని మార్చుకుని పార్లమెంటులో వివిధ అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తోంది. అయితే అనూహ్యంగా ఢిల్లీలోకి కపిల్ సిబ్బల్ ఇంట్లో జరిగిన విందుభేటీకి తెలంగాణాలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నేత హాజరవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. విందుకు హాజరైనంత మాత్రానా మోడి వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారని అనుకునేందుకు లేదు. కాకపోతే భేటికి హాజరవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈరోజు తీసుకున్న స్టాండ్ మీద కేసీయార్ రేపు నిలబడతారని గ్యారెంటీ లేదు. గతంలో చాలాసార్లు ఇలాగే చేశారు. 2009లో చంద్రబాబనాయుడు, వామపక్షాలతో కలిసి పోటీచేసిన కేసీయార్ ఎన్నికలు ముగియగానే బీజేపీతో చేతులు కలిపిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే అవసరం అనుకున్నపుడు వామపక్షాలను దగ్గరకు తీసి వెంటనే పక్కకు తోసేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటివరకు మోడి వ్యతిరేక గ్రూపు భేటిలో టీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయటం ఆశ్చర్యంగానే ఉంది.