Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు శంఖం అవ‌స‌ర‌మొచ్చింది!

By:  Tupaki Desk   |   23 April 2018 6:28 AM GMT
కేసీఆర్‌ కు శంఖం అవ‌స‌ర‌మొచ్చింది!
X
శంఖంలో పోస్తే కానీ తీర్థం కాద‌న్న నానుడిని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫాలో కావాల‌ని డిసైడ్ అయ్యారు. ఏం చేసినా నాలుగు అడుగులు ముందుకు ఆలోచించి నిర్ణ‌యం తీసుకునే అల‌వాటున్న కేసీఆర్‌ కు.. త‌న జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశంపై పార్టీలో చ‌ర్చ చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చేసింది. గ‌డిచిన కొద్దిరోజులుగా జాతీయ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిని వ్య‌క్తం చేయ‌టం.. ఇందులో భాగంగా టూర్లు వేయ‌టం తెలిసిందే.

పైకి మాత్రం ప్ర‌జా ఫ్రంట్ ఏర్పాటు కోసం ప‌లువురు జాతీయ నేత‌ల‌తో భేటీ కావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్‌.. తొలిద‌శ‌లో త‌న‌తో క‌లిసి వ‌చ్చే రాష్ట్రాధినేత‌ల్ని.. కీల‌క నేత‌ల‌తో భేటీ అవుతూ.. వారి స్పంద‌న‌ను మ‌దింపు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఫ్రంట్ పేరుతో రాష్ట్రాల‌కు వెళుతున్న కేసీఆర్‌.. అదే స‌మ‌యంలో ఆయా రాష్ట్రాల వారికి మాత్రం అక్క‌డి పుణ్య‌క్షేత్రాల‌కు వ‌స్తున్న‌ట్లుగా స‌మాచారం ఇవ్వ‌టం విశేషం. ఇదే విష‌యాన్ని ఒడిశా రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ మీడియాతో చెప్ప‌టంతో అవాక్కు కావ‌టం తెలుగోళ్ల వంతైంది. ప్ర‌జా ఫ్రంట్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఒక తీరుతో ప్ర‌చారం చేస్తున్న కేసీఆర్ అండ్ కో.. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్న‌మైన విధానాన్ని ఫాలో కావ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. జాతీయ రాజ‌కీయాల్లో తాను ఏర్పాటు చేయాల‌నుకుంటున్న ఫ్రంట్‌ కు సంబంధించిన అంశాల‌పై పార్టీలో చ‌ర్చ‌కు పెట్టాల‌న్న ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని కేసీఆర్ తీసుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నెల 27న టీఆర్ ఎస్ 17వ ఆవిర్భావ దినోత్స‌వం కావ‌టం.. ఈ సంద‌ర్భంగా కొంప‌ల్లిలో పార్టీ ప్లీన‌రీని ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 31 జిల్లాల నుంచి 15 వేల మంది ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించే స‌భ‌లో జాతీయ రాజ‌కీయాల ముచ్చ‌ట తీసుకురావ‌టం ద్వారా.. గులాబీ అధినేత‌ను ఢిల్లీ య‌వ్వారాలు చూడాల‌న్న మాట‌ను పార్టీ ప‌రంగా చెప్పించాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నారు. దీనికి వెనుక అస‌లు విష‌యం మ‌రొక‌టి ఉంద‌న్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించిన నిర్ణ‌యం పార్టీ తీసుకోవ‌టం అంటే.. రాష్ట్ర వ్య‌వ‌హారాలు చూసేదెవ‌ర‌న్న చ‌ర్చ పార్టీలో మొద‌ల‌వుతుంది. త‌న త‌ర్వాత త‌న కుమారుడికే రాజ్యాధికారం ద‌క్కాల‌న్న ఆలోచ‌న కేసీఆర్‌ లో ఉండ‌టం తెలిసిందే.

త‌న ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు పార్టీని ప్ర‌భావితం చేయించే ప‌నిలో భాగంగా పార్టీ ప్లీన‌రీలో త‌న జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాల్ని చ‌ర్చ‌కు పెట్టి.. ఏక‌గ్రీవ తీర్మానం చేయ‌టం.. అదే ఊపులో రాష్ట్ర రాజ‌కీయాల‌కు సంబంధించిన బాధ్యుడు విష‌యంలో ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చే వీలుంద‌ని చెబుతున్నారు.

వ‌చ్చే ఏడాది ప్లీన‌రీ నాటికి ఎన్నిక‌లు జ‌రిగే వీలున్న నేప‌థ్యంలో అప్పుడు నిర్వ‌హించే అవ‌కాశం ఉండ‌దు. దీంతో.. ఈ ఏడాదే ఘ‌నంగా నిర్వ‌హించ‌టంతో పాటు.. త‌న రాజ‌కీయ వార‌సుడి విష‌యంలోనూ ప్లీన‌రీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే వీలుంద‌ని చెబుతున్నారు.

పార్టీలో త‌న మాటే వేద‌వాక్కు అయిన‌ప్ప‌టికీ.. శంఖంలో పోస్తే తీర్థం అయిన చందంగా త‌న జాతీయ ఫ్రంట్ విష‌యంలో పార్టీ మొత్తం త‌న వెనుక‌నే ఉంద‌న్న క‌ల‌ర్ కోస‌మే.. ప్లీన‌రీలో తీర్మానాన్ని చేయిస్తారిన చెబుతున్నారు. పార్టీలో కీల‌క‌మైన ప్ర‌తినిధుల స‌భ ఆమోదిస్తేనే తాను జాతీయ‌రాజ‌కీయాల్లోకి వెళ‌తాన‌ని.. లేనిపోంలో ఆ అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌టం చూస్తే.. కేసీఆర్ మ‌న‌సును కాద‌నే ద‌మ్ము..ధైర్యం గులాబీ పార్టీలో ఎవ‌రికైనా ఉందా అంట‌?