Begin typing your search above and press return to search.
మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్ మార్టం.. ఆ నివేదికలో ఏముంది?
By: Tupaki Desk | 5 Nov 2022 1:30 PM GMTమునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దాదాపు 93శాతం పోలింగ్ నమోదు కావడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే బూత్ ల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ శుక్రవారం పోస్ట్ మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93శాతం పోలింగ్ నమోదైనట్టు అంచనాకు వచ్చింది. పోలింగ్ శాతం పెరగడం అధికార టీఆర్ఎస్ కే లాభిస్తుందన్న అంచనాకు వచ్చారు.
ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ తాజాగా మండలాలు, యూనిట్ల వారీగా పార్టీ ప్రచార ఇన్ చార్జీలుగా పనిచేసిన నేతలు తమ నివేదికలు సమర్పించారు.
పోలింగ్ బూత్ ల వారీగా నమోదైన ఓట్లు, వాటిలో టీఆర్ఎస్ తోపాటు ఇతర పార్టీలకు వచ్చే ఓట్లపై తమ అంచనాలను గణాంకాలతో సహా పొందుపరిచారు.
ఇక బూత్ ల వారీగా ఓట్ల అంచనాను స్వయంగా మంత్రి జగదీశ్ రెడ్డి,నల్గొండ ఇన్ చార్జి, ఎమ్మెల్యే రవీందర్ రావు స్వయంగా నివేదికలను క్రోడీకరించి శుక్రవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు అందజేసినట్టు సమాచారం. పోలైన ఓట్లలో 50 శాతం మేర ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి సాధించాడని ఆ నివేదికలో ఉన్నట్టు సమాచారం.
ఇక పార్టీ ఇన్ చార్జీల నుంచి అందిన నివేదికలతోపాటు నిఘా సంస్థలు, ప్రైవేటు సంస్థల నివేదికలు, వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా సీఎం విశ్లేషించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏజెంట్ల జాబితాపై కూడా కసరత్తు చేసినట్టు సమాచారం.
ఇక పార్టీ తరుఫున ఏజెంట్లకు శనివారం టీఆర్ఎస్ అవగాహన కల్పించింది. నెలరోజులుగా బిజీగా ప్రచారం చేసిన నేతలందరూ ఫలితాల కోసం ఇప్పుడు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ నివేదికలో 50శాతం ఓట్లు అంటున్నా ఎగ్జిట్ పోల్స్ లో అంతరావని తేలింది. కేవలం 2 నుంచి 3 శాతం ఓట్ల తేడాతోనే టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తేలింది. మరి ఈ అంచనాలు నిజం అవుతాయా? లేవా? అన్నవి వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.