Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. పార్టీ పేరుపై బహిరంగ ప్రకటన

By:  Tupaki Desk   |   7 Nov 2022 8:30 AM GMT
టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. పార్టీ పేరుపై బహిరంగ ప్రకటన
X
తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత రాష్ట్ర సమితిగా మారనుంది. ఈ మేరకు ఆ పార్టీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. పార్టీ పేరును 'భారత్ రాష్ట్రసమితి'గా మారుస్తున్నట్టు ప్రకటనలో తెలిపింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరిట జారీ అయిన ఈ ప్రకటనలో పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పంపాలని అందులో సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఇప్పటికే గుర్తింపుపొందిన రాజకీయ పార్టీకి పేరు మార్పు, ఇతరత్రా సవరణలు ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది.

దీని కోసం స్తానిక పత్రికలతోపాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదురు పార్టీ ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈసీ ప్రకటన జారీ చేసింది.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్ గత నెల దసరా రోజున ప్రకటించారు. తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై ప్రవేశపెట్టిన తీర్మానానికి 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

ఇక టీఆర్ఎస్ పేరు మార్చుతూ భారత రాష్ట్ర సమితిగా ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కేకే పంపారు. మాజీ ఎంపీ వినోద్, లీగల్ టీంలు ఎన్నికల కమిషన్ కు అందజేస్తారు.టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా గుర్తించాలని కోరుతూ ఈసిని కోరారు.. ఈసీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను గమనించి అభ్యంతరాలు లేకుండా పేరును ఖాయం చేసి గుర్తును కేటాయిస్తారు.

ఇందులో భాగంగానే ఈసీ నిబంధనల మేరకు బీఆర్ఎస్ పేరు మార్పుపై బహిరంగ ప్రకటన విడుదల చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.