Begin typing your search above and press return to search.
ఏపీలో కేసీఆర్ అడుగు.. వైసీపీకి మేలు చేస్తుందా?
By: Tupaki Desk | 12 Jun 2022 12:30 PM GMTరాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఏ చిన్న అడుగు ఎటు పడినా.. రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే.. ఏపీలో నూ చోటు చేసుకుం టోందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ పార్టీకి, ఆయన పాలనకు చెక్ పెట్టాల ని.. అన్ని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలిపోకుండా చూ సేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రస్తుతం దీనికి సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీలు వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు ఒక పక్కా ప్రణాళిక సిద్ధమవుతోంది. నిజానికి ఎవరికి వారుగా పోటీ చేసి.. గత ఎన్నికల్లో తప్పు చేశామనే భావన ఈ మూడు పార్టీల్లోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని.. వైసీపీని పక్కన పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంటే.. జగన్‌కు వైసీపీకి వ్యతిరేకంగా పడే ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకుని ఒడిసి పట్టుకునేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఇలాంటి కీలక సమయంలో ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు పొరుగునే ఉన్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండడం సంచలనంగా మారింది. ప్రస్తుతం జాతీయ పార్టీని పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్తే.. కనీసం మూడు రాష్ట్రాల్లో పార్టీ ఉండాలి. అదేవిధంగా 2 శాతం ఓటు బ్యాంకు కలిగి ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. వీటిని ఆయన రీచ్ అయ్యేందుకు ఏపీని ఎంచుకునే అవకాశం ఉంది.
అంటే.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఏపీలో అడుగు పెట్టే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. ఏపీతో అనుబంధం ఉన్న వేల కొద్దీ నాయకులు కేసీఆర్ చెప్పు చేతల్లో ఉన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టిన వారు.. ఏపీలో సంబంధాలు కలిగి ఉన్నవారు.. ఇలా ఎందరో కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏపీలో పోటీ చేస్తానంటే.. వీరంతా సహకరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. జగన్ వ్యతిరేక ఓటు బ్యాంకు.. కేసీఆర్‌కు అనుకూలంగా మారే ఛాన్స్ ఉంటుంది.
దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. జనసేన-టీడీపీ పొత్తును ఇష్టపడనివారు... లేదా జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తును ఇష్టపడనివారు.. కేసీఆర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అంటే అంతిమంగా.. జగన్ వ్యతిరేక ఓటు చీలిపోయి.. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి పడే ఛాన్స్ కనిపిస్తోంది . ఇదే జరిగితే.. జగన్‌కు అనుకూలంగా పరిస్థితి మారే అవకాశం ఉంటుందని.. మరోసారి ఆయన సునాయాశంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.