Begin typing your search above and press return to search.
బీజేపీ యువనేతను పాపులర్ చేసిన టీఆర్ఎస్...ఎందుకంటే....
By: Tupaki Desk | 23 Nov 2020 5:50 PM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేది తామేనని భావిస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే స్థానిక నేతలు ప్రచార పర్వంలో నిమగ్నం అయ్యారు. దీనికి తోడుగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్‌కు విచ్చే బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా టీఆర్‌ఎస్ గత మేనిఫెస్టోపైనా చార్జ్ షీట్ విడుదల చేశారు. ఇక తాజాగా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, పార్టీ యువ ఎంపీ తేజస్వీ సూర్య నగరంలో పర్యటించారు. అయితే, ఆయన పర్యటనను టీఆర్ఎస్ హైలెట్ చేయడం గమనార్హం.
బీజేపీ నిర్వహించబోయే రోడ్ షోలలో భాగంగా, స్టార్ క్యాంపెయినరుగా తేజస్వీ సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఛేంజ్ హైదరాబాద్' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన తేజస్వి సూర్య అనంతరం ప్రసంగించారు. హైదరాబాద్‌లో మార్పు తీసుకొచ్చే వాతావరణం కనిపిస్తోందని, దీనికి సామాన్య బీజేపీ కార్యకర్తలే కారణమని తేజస్వీ సూర్య చెప్పారు. దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందని, తెలంగాణలో వచ్చే మార్పునకు `ఛేంజ్ హైదరాబాద్` నాంది అవుతుందన్నారు. దేశంలోనే తెలంగాణ యువత 'వెల్ టాలెంటెడ్ & హార్డ్ వర్కింగ్' యువతను కలిగి ఉందన్న తేజస్వి ఏ పోటీ పరీక్షలో నైనా టాప్ టెన్ లో 50 శాతం ఏపీ-, తెలంగాణ వారివేనన్నారు. తెలంగాణ ప్రజలు, యువత ఎంతో చైతన్యవంతులని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్, ఎంఐఎంపై తేజస్వీ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆరోపించారు. కేసీఆర్, ఓవైసీ రాజకీయాలను ప్రైవేటు సంస్థలుగా మార్చారని తేజస్వి సూర్య విమర్శించారు. ఓవైసీ సోదరుల కారణంగానే రోహింగ్యాలు హైదరాబాద్‌ను ఆవాసంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. మహమ్మద్ అలీ జిన్నా కొత్త అవతారము అసదుద్దీన్ ఓవైసీ అని ఆరోపించారు. ``అక్బరుద్దీన్, ఆసద్దుద్దీన్ ఇది నిజాం కాలం కాదు.. హిందు హృదయ సామ్రాట్ మోడీ కాలం. ఈ దేశాన్ని ఇస్లామీకరణ కానివ్వం`` అని తేజస్వి సూర్య వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడటం ఏమిటని తేజస్వీ ప్రశ్నించారు. `టర్కీ ప్రధాని భారత దేశాన్ని వ్యతిరేకిస్తాడు. ఎంఐఎం ఒక్కటే దేశాన్ని పాకిస్తాన్ కావాలని అనుకుంటుంది, అందుకే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారు. మేము హైదరాబాద్ ని ఇస్తాంబుల్ చేయము, మేము హైదరాబాద్ ని భాగ్యనగర్ చేస్తాం`` అని ప్రకటించారు. ఒవైసికి ఇక్కడ ఓటు వేస్తే ఆయన మహారాష్ట్ర, బీహార్, యూపీ, కర్ణాటకల్లో బలోపేతం అవుతాడు. అని వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా తేజస్వి హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయన్ను టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంచింది!. ఔను. గో బ్యాక్ తేజస్వి అనే హ్యాష్ టాగ్‌తో ట్విట్టర్‌లో టీఆర్ఎస్ ప్రచారం చేసింది. తేజస్వి నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావిస్తూ, గతంలో ఆయన చేసిన పలు కామెంట్లు ఉదహరిస్తూ హోరెత్తించింది. దీంతో తేజస్వి టాప్‌లో నిలిచారు.