Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ గెలుపు.. ఎన్ని రాజకీయ పరిణామాలకు తెర తీసిందంటే?
By: Tupaki Desk | 21 March 2021 11:30 AM GMTఒక విజయం ఇచ్చే ధైర్యం కొండంత. మరి.. ఒక అపజయం మిగిల్చే ఆవేదన అంతా ఇంతా కాదు. వరుస రెండు ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్న తెలంగాణ అధికారపక్షం.. ఎట్టకేలకు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయం టీఆర్ఎస్ లో కొత్త జోష్ కు కారణమైతే.. విపక్షాలకు ఊహించని షాక్ ను ఇచ్చాయి. ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అడ్రస్ గా గులాబీ విజయం మారితే.. అదే సమయంలో విపక్షాల వేదన అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది.
వరుస రెండు ఎన్నికల్లో సాధించిన విజయాలతో మాంచి జోష్ మీద ఉన్న బీజేపీ దూకుడుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు బ్రేకులు వేసిందని చెప్పాలి. తెలంగాణలో తమకిక తిరుగులేదన్న భావనలో ఉన్న కమలనాథులు తమ గురించి.. తమ బలం బలహీనతల గురించి కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని తీసుకొచ్చింది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును తమ నుంచి తీసుకోవటాన్ని బీజేపీ జీర్ణించుకోలేని పరిస్థితి.
అంతేకాదు.. తెలంగాణ శాసన మండలిలో బీజేపీకి చోటు లేని దుస్థితి. ఇక.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయం. ఓటమికి కేరాఫ్ అడ్రస్ గా.. బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని చెప్పాలి. ఎవరెంత చెప్పినా.. ఓడిపోవటానికే కాంగ్రెస్ పార్టీ ఉందన్న భావన కలుగచేస్తోంది. ఇటీవల ఏపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నట్లు.. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. నేతలంతా వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న సంచలన సలహాను ఇవ్వటం తెలిసిందే. దీనిపై వీహెచ్ లాంటి కొందరు సీరియస్ అయినా.. తాజా ఎమ్మెల్సీ ఫలితాల్ని చూసినప్పుడు మాత్రం.. జేసీ మాటలో నిజం ఉంది కదా? అన్న భావన కలుగక మానదు.
ఇక.. ప్రొఫెసర్ కోదండరాం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సాధనలో కీలక భూమిక పోషించిన నేత.. ప్రత్యక్ష ఎన్నికలు తనకు ఏ మాతరం సరిపోవన్న వాస్తవాన్ని ఆయన గుర్తిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు మీద కోటి ఆశలు పెట్టుకున్న కోదండరాంకు నిరాశే మిగిలింది. దీంతో.. తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించిన కోదండరాంకు ఎన్నికల్లో గెలిచేంత సీన్ లేదన్న విమర్శ వినిపిస్తోంది.
ఃవామపక్షాలకు తాజా ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. వాటి ఉనికి తెలంగాణలో కనుమరుగైనట్లుగా చెప్పాలి. టీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నింటిలో ఎమ్మెల్సీ ఓటమి కమ్మేస్తే.. అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాల్లో ఓడినా.. ప్రజల గుండెల్ని గెలిచిన అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అవతరించారు. తాజా ఎన్నికల్లో ఆయనో హీరోగా అవతరించారని చెప్పక తప్పదు.