Begin typing your search above and press return to search.
ఆ ఆరు.. మార్చాయి కారు గేరు
By: Tupaki Desk | 17 Dec 2018 5:08 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీట్లతో పాటు ఓట్ల శాతమూ పెరగడంతో టీఆర్ఎస్ పార్టీ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. అయితే.. టీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం ఇంతగా పెరగడం వెనుక ఓ విచిత్రమైన పరిస్థితి దాగుంది. ఆ పార్టీ ఓడిపోయిన 5 అసెంబ్లీ సీట్లే ఓట్ల శాతం పెరగడానికి కారణం కావడం విశేషం. వీటితో పాటు గెలిచిన స్థానం మరొకటి కూడా సహకరించింది.
అంతేకాదు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్ల శాతం పెరగడానికి కారణం పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి గతం కంటే భారీగా ఓట్ల శాతం పెరగడమే. కానీ, అలా ఓట్ల శాతం సాధించి పెట్టిన అభ్యర్థుల్లో ఎక్కువమంది ఫిరాయింపు నేతలే.
2014 ఎన్నికల్లో సింగిల్ డిజిట్ ఓట్ షేర్ ఉన్న నియోజకవర్గాలు కొన్నిట్లో ఈసారి భారీ షేర్ వచ్చింది. అక్కడ పార్టీ విజయం సాధించకపోయినా టోటల్ ఓట్ షేర్ పెరగడానికి కారణమైంది. అలాంటివి కొన్ని చూద్దాం.
* అశ్వారావుపేట: 2014లో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఆదినారాయణ కేవలం 9.2 శాతం ఓట్లు సాధించారు. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకుని పోటీ చేయించింది టీఆర్ఎస్. ఫలితం 37.86 శాతం ఓట్లు. అయితే... ఆయన మాత్రం గెలవలేదు. టీడీపీ అభ్యర్థి 48.21 శాతం ఓట్లతో విజయం సాధించారు.
* భద్రాచలం: ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె రామకృష్ణ కేవలం 5.26 శాతం ఓట్లు సాధించారు. ఈసారి అభ్యర్థి తెల్లం వెంకటరావు 32.56 శాతం ఓట్లు సంపాదించారు. అయితే.. ఈ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి పొడెం వీరయ్య 43.23 శాతం ఓట్లతో గెలిచారు.
* ఖమ్మం: గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆర్జేసీ కృష్ణ కేవలం 7.62 శాతం ఓట్లు సాధించారు. ఈసారి ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్ కుమార్ 49.7 శాతం ఓట్లతో విజయం సాధించారు.
* మధిరలో 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి 0.82 శాతం ఓట్లే సాధించారు. ఈసారి అభ్యర్థి గెలుపు సాధించలేకపోయినా 41.21 శాతం ఓట్లు సంపాదించారు.
* సత్తుపల్లిలో గత సారి పిడమర్తి రవి 3.52 శాతం ఓట్లు సాధించగా ఈసారి 40.87 శాతం ఓట్లు పొందారు. విజయం మాత్రం టీడీపీని వరించింది.
* వైరాలో గత సారి టీఆర్ఎస్ అభ్యర్థి చంద్రావతి 5.24 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఈసారి అభ్యర్థి మదన్ లాల్ 32.08 శాతం ఓట్లు సంపాదించారు. ఈసారి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎల్.రాములు నాయక్ గెలిచారు.