Begin typing your search above and press return to search.

పార్లమెంట్ ఉభయ సభల నుంచి టీఆర్ఎస్ వాకౌట్

By:  Tupaki Desk   |   6 Dec 2021 1:59 PM IST
పార్లమెంట్ ఉభయ సభల నుంచి టీఆర్ఎస్ వాకౌట్
X
రైతు సమస్యలపై పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తూ వస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా తెలంగాణలో వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ధాన్యం కేంద్రం కొనుగోలు చేయడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం.. కాదు కాదు.. టీఆర్ఎస్ సర్కారే అమ్మడం లేదని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా దుమ్మెత్తిపోసుకున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ రైతుట పట్ల కేంద్రప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఉభయసభల నుంచి ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇవాళ ఆరోరోజు కూడా ఉభయసభల్లో ఆందోళన కొనసాగించారు టీఆర్ఎస్ ఎంపీలు.

లోక్ సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి రైతులను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.‘సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం’ తీసుకురావాలని నినదించారు. ఇక కేంద్రప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ఎంపీలు.. రవిధాన్యం సేకరణను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు.

పార్లమెంట్ లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు పార్లమెంట్ ఉభయసభల నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ ప్రకటించారు టీఆర్ఎస్ ఎంపీలు.

దీంతో రైతుల కోసం ధాన్యం సేకరణ కోసం పోరాడిన టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రం తీరుతో విసుగుతు చెంది పార్లమెంట్ నుంచే వాకౌట్ చేసిన పరిస్థితి నెలకొంది.