Begin typing your search above and press return to search.
ఏ సర్వే చూసినా గులాబీ పువ్వులే!!
By: Tupaki Desk | 7 Dec 2018 3:32 PM GMTసర్వేలను చూసినా, ఎగ్జిట్ పోల్స్ ని పరిశీలించినా గులాబీ పార్టీ దే ప్రభంజనమని తేలిపోయింది. తెలంగాణ లో టీఆర్ఎస్ కు ఎదురులేదని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కుండబద్దలు కొట్టాయి. తెలంగాణ ప్రజలంతా మళ్లీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకున్నారని స్పష్టంచేశాయి. కుట్రలమారి కూటములను తెలంగాణ ప్రజలు ఈడ్చి బండకొట్టారని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేలిపోయింది.
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత ఇండియాటు డే ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది. తెలంగాణ లో గులాబీ పార్టీ 79 నుంచి 91 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. కుట్రలమారి కూటమి 21 నుంచి 33 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేశాయి. బీజేపీకి ఒకటి నుంచి మూడు సీట్లు, ఎంఐఎంకు నాలుగు నుంచి ఏడు సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. ఇక పార్టీల వారీ గా ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే.. టీఆర్ఎస్ కు 46 శాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీకి 37 శాతం, బీజేపీకి 7 శాతం, ఎంఐఎంకు 3 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్లోనూ గులాబీ పార్టీ దే జయకేతనమని తేలిపోయింది. టీఆర్ఎస్ కు 66 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కూటమికి 37, బీజేపీకి 7, ఎంఐఎంకు 7, ఇతరులకు రెండు సీట్లు వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
తెలంగాణలో గులాబీ పార్టీ అఖండ విజయం ఖాయమని వీడీపీ ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టం చేశాయి. టీఆర్ఎస్ కు 55 నుంచి 65 సీట్లు వస్తాయని వెల్లడించాయి. కూటమికి 34 నుంచి 44 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపాయి. బీజేపీకి 5 నుంచి 7, ఎంఐఎంకు 7 నుంచి 8 సీట్లు రావొచ్చని అంచనా వేశాయి. ఇక ఇతరులు 6 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశమున్నట్టు వీడీపీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
టీఆర్ఎస్ పార్టీ 50 నుంచి 65 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కూటమికి 38 నుంచి 52 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపాయి. బీజేపీ 4 నుంచి 7, ఎంఐఎం 5 నుంచి 7 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. 3 నుంచి 7 సీట్లు ఇతరులకు రావొచ్చని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ని పరిశీలిస్తే.. టీఆర్ఎస్ 57 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైంది. కూటమికి 46, బీజేపీకి 6, ఇతరులకు 10 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సూర్జిత్ భళ్లా నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ 70 సీట్లు సాధిస్తుందని వెల్లడైంది. కూటమికి 31, బీజేపీ 8, ఇతరులు 10 స్థానాల్లో గెలుస్తారని సూర్జిత్ భళ్లా వెల్లడించారు.
హైదరాబాద్కు చెందిన ఆరా సంస్థ సర్వేలో గులాబీ గుభాళించింది. 75 నుంచి 85 సీట్లు గెలుచుకుని గులాబీ పార్టీ విజయభేరి మోగిస్తుందని ఆరా సర్వే తేల్చిచెప్పింది. ఈ సర్వేలో కూటమికి 25 నుంచి 35 సీట్లు మాత్రమే వస్తాయని స్పష్టమైంది. బీజేపీకి 2 నుంచి 3 సీట్లు, ఇతరులకు 8 నుంచి 11 సీట్లు వచ్చే అవకాశముందని ఆరా సర్వే అంచనా వేసింది.
84 నుంచి 89 సీట్ల తో టీఆర్ఎస్ తెలంగాణ లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. కూటమికి 19 నుంచి 21, ఎంఐఎంకు 7, బీజేపీకి 2, ఇతరులకు రెండు స్థానాలు రావొచ్చని తెలిపాయి. అటు టీఆర్ఎస్ పార్టీ 62 నుంచి 70 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కూటమికి 32 నుంచి 38 సీట్లు, బీజేపీకి 6 నుంచి 8 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఒక స్థానంలో ఇతరులు గెలిచే అవకాశమున్నట్టు ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
మొత్తమ్మీద సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ అఖండ విజయం ఖాయమని తేలడంతో గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.