Begin typing your search above and press return to search.
ఎవరికీ తెలీని ట్రక్కు గులాబీ కారును దెబ్బేసిందట!
By: Tupaki Desk | 4 Jan 2019 5:30 AM GMTఅసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కారు ఎంతలా దూసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కారు జోరుకు కూటమి మాత్రమే కాదు.. కమలం సైతం ఆగమాగమైన పరిస్థితి. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లను కారు ఖాతాలో వేయటం తెలిసిందే. దీంతో.. 88 సీట్లలో టీఆర్ ఎస్ అభ్యర్థులు విజయాన్ని సొంతం చేసుకోవటం సులువైంది.
తొలిసారి తెలంగాణలో సొంతంగా పోటీ చేసిన 2014లో కారుకు ప్రజలు 63 సీట్లు ఇస్తే.. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 88 నియోజకవర్గాల్లోని అభ్యర్థులు విజయాన్ని నమోదు చేయటం అంత సులువైన పని కాదు. ఇదే విషయాన్ని పలు వేదికల మీద ప్రస్తావిస్తున్నారు కేటీఆర్.
గులాబీ కారు జోరు కారణంగా వంద సీట్లను అలవోకగా సొంతం చేసుకుంటామని కేసీఆర్ మొదట్నించి చెబుతున్నారు. మరి.. ఆయన అంచనాలు ఎక్కడ తప్పాయన్న విషయాన్ని తాజాగా కేటీఆర్ రివీల్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉండే ట్రక్కు గుర్తు కారణంగా 1.65 లక్షల ఓట్లు పక్కదారిన పడ్డాయని.. వాటిని కలుపుకుంటే టీఆర్ ఎస్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించి ఉండేదని కేటీఆర్ చెప్పారు.
కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో పది సీట్లను కోల్పోయామని.. ట్రక్కు గుర్తు తమను దెబ్బేయకుంటే క్లీన్ స్వీప్ దిశగా గులాబీ కారు దూసుకెళ్లి ఉండేదని.. వంద మార్క్ ను అలవోకగా సాధించే వారిమన్న మాటను కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గల్లీలోనూ గుర్తించే గులాబీ కారును మర్చిపోయి మరీ.. ట్రక్కుకు ఓటేయటం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పని పరిస్థితి. గుర్తును పోలున్న గుర్తుకు ఓట్లు పడటం కామన్. అందుకు టీఆర్ ఎస్ మినహాయింపు ఎంతమాత్రం కాదన్న విషయాన్ని ట్రక్కు స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.