Begin typing your search above and press return to search.
ఆర్థిక నేరగాళ్లకి లండన్ ఎందుకు ప్రత్యామ్న్యాయంగా మారింది !
By: Tupaki Desk | 22 March 2021 6:30 AM GMTభారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి, బ్రిటన్ కు పరారైన ప్రముఖుల బాగోతాలను వివరిస్తూ తాజాగా ఒక పుస్తకం ప్రచురితమైంది. 'ఎస్కేప్డ్ : ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్' పేరిట రూపొందిన ఈ పుస్తకంలో కింగ్ ఫిషర్ మాజీ అధిపతి విజయ్ మాల్య, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, నౌకాదళ మాజీ అధికారి రవి శంకరన్, సంగీతకారుడు నదీమ్ సైఫీ తదితరుల వ్యవహారాలను పొందుపరిచారు. లండన్ కేంద్రంగా పనిచేసే పాత్రికేయులు, పరిశోధకులు డానిష్, రుహీ ఖాన్లు దీన్ని రచించారు.
ఈ రోజు విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్ నేరగాళ్లకి లండన్ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, భారత్ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్ నదీమ్ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు.
ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్ లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్ ఏ విధంగా భారత్ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్ ఖాన్ వెల్లడించారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్ కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. నేర సామ్రాజ్యం క్రికెట్-బాలీవుడ్ మధ్య ఉన్న సంబంధాలు, భారత్-పాకిస్థాన్ దౌత్య యుద్ధాల గురించి ఇందులో ప్రస్తావించినట్లు తెలిపారు. భారత్, బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.