Begin typing your search above and press return to search.
హైకమాండ్ దగ్గరికి నకిలీ వైసీపీ నాయకుల తాకిడి ఎక్కువైందా?
By: Tupaki Desk | 10 Aug 2020 1:00 PM GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నకిలీ వైసీపీ నాయకులు ఇప్పుడు నిజమైన వైసీపీ నేతలను పక్కనపెట్టి మరీ పనులు చేయించుకుంటున్న వైనం చర్చనీయాంశమవుతోంది. హైకమాండ్ దగ్గరికి వైసీపీకి సంబంధం లేని పక్కా టీడీపీ, జనసేన నాయకులు వచ్చి అధిష్టానం నేతలను పొగుడుతూ మచ్చిక చేసుకుంటూ పనులు చేసుకుంటున్నారట.. ఈ నకిలీ వైసీపీ నాయకులు వెళ్లి అధిష్టానం పెద్దలను కలిస్తూ ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులకు ఫోన్లు చేసి పనులు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందట.. ఈ పరిణామాన్ని పదేళ్లుగా వైసీపీనే నమ్ముకొని నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్న నిజమైన వైసీపీ నాయకులు జీర్ణించుకోవడం లేదు.
గత పదేళ్లుగా వైసీపీ పార్టీలో ఉన్న నాయకులకు హైకమాండ్ పెద్దలతో సాన్నిహిత్యం.. అనుబంధం లేదు. దీంతో ఈ నకిలీ వైసీపీ నేతలు తమ పరిచయాలతో నేరుగా అధిష్టానం పెద్దలతో తామే అసలైన నాయకులం అంటూ నమ్మిస్తూ నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆవేదన క్షేత్రస్తాయి నేతల్లో ఉంది.
దీంతో వైసీపీ ప్రభుత్వంలో నకిలీ వైసీపీ నాయకులు లాభపడుతుండగా.. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడిన నేతలకు చిప్ప చేతికి వస్తోంది. నియోజకవర్గంలో నిజమైన వైసీపీ నాయకులకు ఏమీ పనులు చేపించుకోలేక.. పనులు కాక వారంతా తీవ్రంగా నష్టపోతున్నారట.. ఇంత ఇబ్బందులు పడుతున్నా వైసీపీ అధిష్టానం పెద్దలు మాత్రం నకిలీ వైసీపీ నేతలకే పెద్దపీట వేస్తున్నారని జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.