Begin typing your search above and press return to search.

వ‌ల‌స‌ల‌ను ఆపేందుకు ట్రంప్ కుటుంబం చిచ్చు

By:  Tupaki Desk   |   5 March 2017 7:13 AM GMT
వ‌ల‌స‌ల‌ను ఆపేందుకు ట్రంప్ కుటుంబం చిచ్చు
X
అధికారంలోకి వచ్చాక అమెరికా-మెక్సికోల మధ్య గోడ కడుతానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. మెక్సికన్లు అంటే గిట్టని ట్రంప్ వారు తమ దేశంలోకి రాకుండా నియంత్రించడానికి కొత్త ఆలోచన చేస్తున్నారు. సరిహద్దులు దాటి అక్రమంగా వలస వచ్చే కుటుంబాలకు చెందినవారిలో తల్లుల్ని - పిల్లల్ని వేరు చేయాలన్న ప్రతిపాదన దేశ అంతర్గత భద్రతా విభాగం పరిశీలనలో ఉన్నట్టు ముగ్గురు ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇందువల్ల అక్రమంగా వచ్చే మెక్సికన్ తల్లిదండ్రులను కస్టడీలోకి తీసుకుని వేరువేరుగా విచారించడం సులభమవుతుంది. అమెరికాలో ఉండే వారి బంధువులు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసే గార్డియన్ వచ్చి వారిని తీసుకువెళ్లేంత వరకు ఈ విధంగా తల్లుల్ని - పిల్లల్ని స్వల్పకాలం వేరుగా ఉంచుతారన్న మాట.

మ‌రోవైపు దేశంలో తగిన పత్రాలు లేకుండా ఉం టున్న అక్రమ వలసదారులను గుర్తించే పనిని అమెరికా ఏజెంట్లు మొదలుపెట్టారు. సురక్షిత ప్రాంతాలుగా పరిగణించే ప్రభుత్వ భవనాల్లో - చర్చిల్లో తలదాచుకుంటున్న వలసవాదులను పెద్దఎత్తున అరెస్టుచేస్తున్నారు. ఈ పరిణామాలు వలసదారుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తుండగా, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రీమర్స్ (చిన్నతనంలోనే అమెరికాకు వలస వచ్చినవారు) పైనా అధికారులు చట్టాలు ప్రయోగిస్తున్నారు. ఇటీవల డానియేలా వర్గాస్ అనే 22 ఏళ్ల‌ యువతిని అరెస్టు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అర్జెంటీనాలో పుట్టిన డానియేలా.. చిన్నతనంలోనే అమెరికాకు వచ్చారు. మిస్సిసిపీ రాష్ట్రంలోని జాక్సన్‌ లో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు వారి ఇంటికి తనిఖీకి వచ్చి, ఆమె తండ్రిని, సోదరుడిని అరెస్టు చేశారు. వీరిద్దిరికీ తగిన పత్రాలు లేవు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/