Begin typing your search above and press return to search.

హెచ్‌1బీః మ‌న‌పై మ‌రో దెబ్బ‌కొట్టిన ట్రంప్‌

By:  Tupaki Desk   |   8 March 2017 10:18 AM GMT
హెచ్‌1బీః మ‌న‌పై మ‌రో దెబ్బ‌కొట్టిన ట్రంప్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌తీయుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయ‌న మ‌ద్ద‌తుతో పేట్రిగిపోతున్న అమెరికా జాత్యహంకారులు ఒక‌వైపు అయితే... చ‌ట్టం, కోర్టుల రూపంలో స‌వాల్ విసురుతూ స‌మ‌స్య‌ల పాలు చేస్తున్న వారు మ‌రోవైపు. తాజాగా ట‌్రంప్ ప్ర‌భుత్వం హెచ్‌-1బీ వీసాదారుల‌కు మ‌రో షాక్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మవుతున్న‌ది. హెచ్‌-1బీ వీసాలు క‌లిగిన‌వారి భాగ‌స్వాముల‌కు అమెరికాలో ప‌నిచేయ‌డానికి అనుమ‌తి ఉంటుంది. వీరిని హెచ్‌-4 వీసాదారులు అంటారు. హెచ్‌-1బీ వీసాదారుల‌పై ఆధార‌ప‌డేవాళ్లు ఎన్నో ఏళ్ల‌పాటు పోరాడి ఈ అనుమ‌తిని సంపాదించారు. 2015, ఫిబ్ర‌వ‌రిలో అప్ప‌టి ఒబామా ప్ర‌భుత్వం ఈ అనుమ‌తినిచ్చింది. గ్రీన్‌కార్డు కోసం వేచి చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల భాగ‌స్వాముల‌కు ఈ అవకాశం క‌ల్పించారు. ఇప్ప‌టికే వేలాది మంది ఇండియ‌న్స్ ఇలా ప‌నిచేస్తున్నారు. అయితే ఇప్పుడా అనుమ‌తిని ర‌ద్దు చేసే యోచ‌న‌లో ట్రంప్ ప్ర‌భుత్వం ఉంది.

ఒబామా ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే గ్రూప్ ఒక‌టి కోర్టుకు వెళ్లింది. కానీ ఇందులో తాము జోక్యం చేసుకోలేమ‌ని అప్ప‌ట్లో కోర్టు చెప్పింది. తాజాగా ట్రంప్ ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే ఈ గ్రూప్ మ‌రోసారి వాషింగ్ట‌న్‌ అప్పీల్స్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జ‌స్టిస్ మ‌ద్ద‌తు కూడా ల‌భించింది. దీనిపై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి 60 రోజుల స‌మ‌యం కోరింది. ప్ర‌స్తుతం అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఉన్న జెఫ్ సెష‌న్స్‌.. అప్ప‌ట్లో సెనేట‌ర్‌గా ఒబామా ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టారు. అయితే అమెరికాలో ఉన్న వేలాది మంది హెచ్‌-4 వీసాదారుల త‌ర‌ఫున ఇమ్మిగ్రేష‌న్ వాయిస్ అధ్య‌క్షుడు అమ‌న్ క‌పూర్ కోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. అస‌లు ఈ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డానికి స‌రైన ఆధార‌మే లేద‌ని అప్పుడే డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పిన విష‌యాన్ని అమ‌న్ క‌పూర్ లేవెనెత్తారు.

ఇన్నాళ్లు వ‌ల‌దారుల‌కు ప్రాణ‌వాయువు వంటి హెచ్‌1బీ పై క‌త్తిగ‌ట్టిన ట్రంప్ టీం ఇపుడు వారిపై ఆధార‌ప‌డిన వారిని కూడా టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. వాషింగ్ట‌న్ కోర్టులో న‌డుస్తున్న కేసులో త‌మ స్పంద‌న కోసం ట్రంప్ ప్ర‌భుత్వం 60 రోజుల గ‌డువు కోరడం చూస్తుంటే పూర్తి స్థాయి అధ్య‌య‌నం చేసి వ్య‌తిరేక నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందంటున్నారు. తాజా ఏడు దేశాల వ‌ల‌సల విష‌యంలో క‌రాఖండిగా ముందుకు సాగిన తీరే ఇలా ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/