Begin typing your search above and press return to search.
వైట్ హౌస్ లో ఎవరికి వారే ఉంటున్న ట్రంప్ దంపతులు
By: Tupaki Desk | 9 Dec 2019 7:14 AM GMTఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు సంబంధించిన సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. తాజాగా విడుదలైన పుస్తకంలో వెల్లడైన ఈ విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి ప్రథమ మహిళగా ఉన్న మెలానియా ట్రంప్.. వైట్ హౌస్ లో రాజభోగాలు అనుభవిస్తున్నట్లుగా భావిస్తే తప్పులో కాలేసినట్లేనని చెబుతున్నారు.
ఎందుకంటే.. ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వైనం తాజా పుస్తకం వెల్లడించింది. భార్యాభర్తలు ఇద్దరు ఎడమొహం.. పెడముఖంగా ఉంటున్నారని పుస్తకం వెల్లడించింది. ఇంతకూ ఆ బుక్ రాసిందెవరు? వారికి ఈ విషయాలన్ని ఎలా తెలుసన్న క్వశ్చన్ కు సమాధానం వెతికితే.. సీఎన్ఎన్ పాత్రికేయురాలు కేట్ బెనెట్ ఈ బుక్ రాశారు. వైట్ హౌస్ అంశాల్ని కవర్ చేసే ఈ మహిళా జర్నలిస్టు ఎక్కువగా మెలనియా వ్యక్తిగత విషయాల్ని కవర్ చేస్తుండటంతో ఆమె రాసిన విషయాలకు విశ్వసనీయత చేకూరిందని చెప్పాలి.
ఫ్రీ మెలనియా - ద అనాథరైజ్డ్ బయోగ్రఫీ పేరుతో ఆమె రాసిన పుస్తకంలో 288 పేజీలు మొత్తం మెలనియాకు సంబంధించిన ఎన్నో కీలక అంశాలు ఉన్నాయి. అత్యంత ప్రైవేటు జీవితాన్ని గడుపుతున్న మొట్టమొదటి ప్రథమ మహిళగా ఆమెను అభివర్ణించారు. ఈ పుస్తకం విడుదలైన నాటి నుంచి మెలనియా వైట్ హౌస్ లో బందీగా గడుపుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి.
సాధారణంగా అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లినా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా ప్రథమ మహిళను వెంట తీసుకెళుతుంటారు. అందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక్కరే వెళుతుండటంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె కిడ్నీలను దాదాపుగా కోల్పోయే స్థితికి చేరుకున్న వైనం బయటకు వచ్చింది.
అంతేకాదు.. ట్రంప్.. మెలనియాలు వైట్ హౌస్ లోని వేర్వేరు గదుల్లో నిద్రిస్తారన్న నిజాన్ని ఈ పుస్తకం బయట పెట్టింది. ట్రంప్ రెండో అంతస్తులో.. మెలనియా మూడోఅంతస్తులో పడుకుంటారని వెల్లడించింది. అంతేకాదు.. ట్రంప్ తన గదికి తాళం వేయాలని సిబ్బందిని ఆదేశిస్తారని చెబుతారు. ట్రంప్.. మెలనియాలకు 13 ఏళ్ల కుమారుడు బారెన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె లోకమంతా అతనేనని చెబుతారు. అయితే.. ఈ పుస్తకంలో ఆ పిల్లాడి గురించి వివరాలు వెల్లడించలేదు. చిన్న పిల్లాడి జీవితాన్ని బహిరంగ చర్చకు పెట్టకూడదన్న ఉద్దేశంతోనే తానా విషయాల్ని పేర్కొనలేదని ఆమె పేర్కొనటం గమనార్హం.