Begin typing your search above and press return to search.

‘సేవ్ అమెరికా’ అని నినదిస్తున్న ట్రంప్!

By:  Tupaki Desk   |   24 Jun 2021 9:30 AM GMT
‘సేవ్ అమెరికా’ అని నినదిస్తున్న ట్రంప్!
X
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల వేళ ఎంత‌టి ర‌చ్చ జ‌రిగిందో తెలిసిందే. తాను ఓట‌మిని అంగీక‌రించేది లేదంటూ భీష్మించిన ట్రంప్‌.. ఓ ప‌ట్టాన బైడెన్ కు ప‌గ్గాలు అప్ప‌జెప్ప‌లేదు. పార్ల‌మెంట్ భ‌వ‌నంపై ఆయ‌న మ‌ద్ద‌తు దారులు దండెత్త‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది. మొత్తానికి అయిష్టంగానే వైట్ హౌస్ నుంచి నిష్క్ర‌మించిన ట్రంప్.. అప్ప‌టి నుంచి జ‌నాల‌కు, మీడియాకు దూరంగానే ఉన్నారు.

ట్విట‌ర్ సంస్థ‌ ట్రంప్ అకౌంట్ ను శాశ్వ‌తంగా ర‌ద్దు చేయ‌డంతో.. ఆయ‌న సోష‌ల్ మీడియాలోనూ లేకుండా పోయారు. ఈ ప‌రిణామాల‌న్నింటితో రాజ‌కీయాల నుంచి ట్రంప్ ప‌క్క‌కు జ‌రిగిపోయిన‌ట్టే అనే అభిప్రాయం ప్ర‌పంచ వ్యాప్తంగా వ్య‌క్త‌మైంది. అయితే.. ఈ మ‌ధ్య మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చారు ట్రంప్‌. జూన్ 6వ తేదీన ప‌బ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న ట్రంప్.. నార్త్ క‌రోలినా ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.

ఇప్పుడు మ‌రో కార్య‌క్ర‌మానికి సిద్ధ‌మ‌వుతున్నారు. జులై 3వ తేదీన భారీ ర్యాలీ నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేర‌కు ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. ‘సేవ్ అమెరికా’ పేరుతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ట్రంప్ ఇలాఖా అయిన ఫ్లోరిడాలో జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్రమాన్ని రిప‌బ్లిక్ ఆఫ్ ఫ్లోరిడా కండ‌క్ట్ చేస్తోంది.

మ‌రి, ‘సేవ్ అమెరికా’ అని ట్రంప్ ఎవ‌రిని ఉద్దేశించి నిన‌దిస్తున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. ట్రంప్ తర్వాత పగ్గాలు చేపట్టిన.. బైడెన్ వ్యాక్సినేషన్ వంటి పలు అంశాల్లో సమర్థవంతంగానే పనిచేశారనే అభిప్రాయం ఉంది. మ‌రి, ఈ మీటింగ్ లో ట్రంప్ ఎవ‌రిని టార్గెట్ చేస్తారు? ఎవ‌రి నుంచి అమెరికాను ర‌క్షించాల‌ని కోర‌నున్నారు? ఏయే అంశాల‌ను ప్ర‌స్తావిస్తారు? అనేది చూడాలి.