Begin typing your search above and press return to search.

మోడీ ఫ్రెండ్ భారత్ ను దెబ్బ తీస్తున్నాడా?

By:  Tupaki Desk   |   16 May 2020 5:30 AM GMT
మోడీ ఫ్రెండ్ భారత్ ను దెబ్బ తీస్తున్నాడా?
X
కరోనా పుట్టించిన చైనా దేశంపై ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ ఆగ్రహంగా ఉన్నాయి. చైనాలో వైరస్ ప్రబలి మొత్తం లాక్ డౌన్ తో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అమెరికా, యూరప్ సహా అన్ని అగ్రరాజ్యాలు చైనాలో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పాయి. వైరస్ ప్రభావంతో ఇప్పుడక్కడ పనులన్నీ ఆగిపోయాయి.

చైనాలో ఉంటే ఇక ఎంతమాత్రం సేఫ్ కాదని భావిస్తున్న దిగ్గజ కంపెనీలన్నీ ఇతర దేశాలకు తమ చైనా కంపెనీలను మార్చాలని యోచిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ చైనా నుంచి తరలిపోయే కంపెనీలను భారత్ వైపు ఆకర్షించాలని పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ వాటితో చర్చలు జరపడానికి రెడీ అవుతున్నారు. అయితే మోడీ డియరెస్ట్ ప్రెండ్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. భారత్ ను దెబ్బతీశాడు.

చైనా నుంచి అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలన్నీ తమ తయారీ కేంద్రాలను అమెరికాకు కాకుండా భారత్, ఐర్లాండ్ లాంటి దేశాలకు తరలిస్తే ఆయా కంపెనీలపై కొత్త పన్నులు విధిస్తామని గట్టిగా హెచ్చరించారు. చైనాలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా అక్కడ ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా సహా తదితర దేశాల కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లాలన్న యోచనాలో ఉన్నాయి. వీటిలో యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలెర్ట్ అయ్యాడు. అమెరికాకు తమ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలతో తిరిగి వచ్చే కంపెనీలకు పన్ను ప్రోత్సాహకం ఇస్తామని ట్రంప్ ప్రకటించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే ఎజండాను ప్రకటించారు. అమెరికన్ కంపెనీలను తిరిగి తమ దేశానికే రప్పించుకోవడానికి ప్రోత్సహకాలు ఇవ్వడానికి బదులు గా వేరే దేశానికి వెళితే పన్ను విధిస్తామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో చైనా నుంచి ఎగ్జిట్ అయ్యే కంపెనీలను భారత్ రప్పించాలనుకున్న మోడీ ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లినట్టు అయ్యింది.మోడీ ఫ్రెండే భారత్ ను దెబ్బతీస్తుండడం విశేషం.