Begin typing your search above and press return to search.
ట్రంప్ గెలవాలని 21 రాష్ర్టాల్లో హ్యాకింగ్ చేసేశారట
By: Tupaki Desk | 23 Jun 2017 5:15 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హ్యాకింగ్ చేసిందా? డొనాల్డ్ ట్రంప్ గెలుపుకోసం రష్యా జోక్యం చేసుకొని ఫలితాలు తారుమారు చేసే క్రమంలో సహకరించిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఒబామా ప్రభుత్వంలో హోంశాఖలో పనిచేసిన జే జాన్సన్ . జాన్సన్ తాజాగా ఇచ్చిన వాంగ్మూలం కారణంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకోసం రష్యా కృషి చేసిందనే వార్తలు నిజమని తేలింది. అమెరికా కాంగ్రెస్‌కు ఇచ్చిన వివరణలో గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 21 రాష్ర్టాల్లో రష్యా హ్యాకింగ్ కు పాల్పడిందని చెప్పారు. ఆ సమయంలో అమెరికా హెచ్చరికల నుంచి దృష్టి మళ్లించేందుకు ట్రంప్ లైంగిక విజయాలపై వీడియో ఒకటి బయటకు వచ్చిందని తెలిపారు.
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను అప్రతిష్ఠ పాల్జేసేందుకు క్రెమ్లిన్ విస్తృతస్థాయిలో కుట్రలు జరిపిందని జాన్సన్ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఓటర్ల నమోదు డాటా బేస్ హ్యాకింగ్‌కు గురవుతున్నదని తాను పలుమార్లు హెచ్చరించానని జాన్సన్ చెప్పారు. కానీ నాడు ఎవరూ తన హెచ్చరికలను పట్టించుకోలేదన్నారు. అప్పుడే ట్రంప్ తన లైంగిక విజయాలను గూర్చి గొప్పలు చెప్పుకున్న 2005 నాటి వీడియో ఒకటి బయటకు వచ్చిందని, అది తన హెచ్చరికల నుంచి అమెరికన్ల దృష్టి మరల్చిందని జాన్సన్ అన్నారు. అదే సమయంలో రష్యా తన పని తాను చేసుకుపోయిందని జాన్సన్ వ్యాఖ్యానించారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్రపై ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఊహాగానాలు సాగుతున్నాయి. రష్యా 21 రాష్ర్టాల్లో హ్యాకింగ్‌కు పాల్పడటం నిజమేనని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారి జీనెట్ మన్‌ఫ్రా తొలిసారి బహిరంగంగా ప్రకటించారు. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు వెల్లడించారు. తాజాగా జాన్సన్ అదే విషయాన్ని వెల్లడించడం కలకలం రేకెత్తిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/