Begin typing your search above and press return to search.
అబ్రహం లింకన్ తర్వాత అంతటి వ్యక్తినని ట్రంప్ సెల్ఫ్‌డబ్బా
By: Tupaki Desk | 13 Jun 2020 5:00 PM GMTఅగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం జాతి వివక్ష పోరాటం కొనసాగుతోంది. జార్జి ఫ్లాయిడ్ హత్యపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపింది. మహమ్మారి వైరస్ విలయతాండవం చేస్తుంటే మరోవైపు నల్ల జాతి నిరసనలతో అట్టుడుకుతోంది. ఆందోళనలు మిన్నంటుతున్న సమయంలో ట్రంప్ మేల్కొన్నారు. తాను చేసిన తప్పిదాన్ని గుర్తించి ఇప్పుడు నివారణ చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ఆయన విరోధాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనకారులు నరమేధం, బానిసత్వాలను ప్రోత్సహించిన నాయకులు, రాజు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాను కనుగొన్న క్రిస్టొఫర్ కొలంబస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఈ క్రమంలో పరిస్థితిని గమనించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిద్దుబాటు దిశగా పలు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని నల్ల జాతీయుల శ్రేయస్సు కోసం తానెంతో కృషి చేశానని చెప్పారు. వారి ప్రగతి కోసం పాటుపడిన అమెరికా అధ్యక్షుల్లో అబ్రహం లింకన్ తర్వాత తాను రెండో స్థానంలో ఉంటానని ప్రకటించారు. నల్ల జాతీయులు చదువుకునే కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీ మొత్తంలో నిధులిచ్చి ప్రోత్సాహించినట్లు వివరించారు. తక్కువ ఆదాయం ఉన్న వారు బిజినెస్ చేసుకునేందుకు పలు పన్ను మినహాయింపులు ఇచ్చానని చెప్పారు.
అయితే ట్రంప్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అందరికీ తెలుసని ప్రత్యర్థులు చెబుతున్నారు. రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న ట్రంప్ ఒక్లహామాలో ఈ నెల 19వ తేదీన జరిపే ర్యాలీ కోసం ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొంటున్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల కోసం లబ్ధి పొందేందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.