Begin typing your search above and press return to search.

సొంత సోషల్ మీడియాని నెలకే క్లోజ్ చేసిన ట్రంప్ !

By:  Tupaki Desk   |   3 Jun 2021 9:30 AM GMT
సొంత సోషల్ మీడియాని నెలకే క్లోజ్ చేసిన ట్రంప్ !
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. అధ్యక్షుడిగా కొనసాగినన్ని రోజులు కూడా నిత్యం వివాదాలతోనే సావాసం చేశారు. పదవి నుండి దిగిపోయే కొద్ది రోజుల ముందు వరకు కూడా అయన అదే ధోరణి కొనసాగించాడు. అధ్యక్షుడిగా తన చివరి రోజుల్లో చెలరేగిపోయారు. ఆయన మద్దతుదారులు వాషింగ్టన్ లో హింసకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆయన ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా మూసేసింది. ఆయన చేసే ట్వీట్ల వల్ల హింస మరింత పెరిగే అవకాశం ఉందనే భావనతో ఆ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన వ్యక్తిగత ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసినప్పటికీ... అమెరికా అధ్యక్షుడి అఫీషియల్ ఖాతా అయిన @POTUS నుంచి ట్వీట్ చేశారు. గొప్ప అమెరికన్ దేశభక్తులారా, మనం మౌనంగా ఉండబోము అంటూ సొంతంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను డెవలప్ చేయించాలనుకుంటున్నట్టు తెలిపారు.

ట్విట్టర్, ఫేస్‌ బుక్‌ లు తన ఖాతాను బ్యాన్ చేయడంతో నెల రోజుల క్రితం ట్రంప్ చెప్పినట్ట సొంత సోషల్ మీడియా సైట్‌ ను ప్రారంభించారు. తన మద్ధతుదారులతో కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన భావించారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే దీన్ని మూసేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నిట్రంప్ మీడియా వ్యవహారాలు చూస్తున్న జాసన్ మిల్లర్ ధృవీకరించారు. “ ఫ్రమ్ ది డెస్క్ అఫ్ డోనాల్డ్ జె . ట్రంప్” ను శాశ్వితంగా మూసేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విశాలమైన ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాసన్ మిల్లర్ తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే మీడియాకు తెలియజేస్తామని చెప్పారు.

అయితే ఈ ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎప్పటిలోగా సిద్ధమవుతోందో, ఇప్పుడే చెప్పలేనన్నారు. మరో సోషల్ మీడియా వేదికలో డొనాల్డ్ ట్రంప్ చేరబోతున్నారా అన్న మీడియా ప్రశ్నకు.. అవునని ఆయన సమాధానమిచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత అమెరికాలోని క్యాపిటల్ భవనంపై డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేసి..హింసను రాజేయడం తెలిసిందే. వీరిని ప్రోత్సహించేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఖాతాలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌ శాశ్వితంగా నిషేధించాయి. మే 4న సొంత సోషల్ మీడియా సైట్‌ను ఏర్పాటు చేసుకున్న ట్రంప్…నెల రోజులు గడవక ముందే దాన్ని మూసేయాలని నిర్ణయం తీసుకోవడం అమెరికా మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై విధించిన శాశ్విత బ్యాన్ ఎత్తేస్తే తిరిగి ఆయన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో చేరొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే , దీనిపై ట్విట్టర్ , పేస్ బుక్ ఏ నిర్ణయం తీసుకుంటాయో..!