Begin typing your search above and press return to search.
జో బిడెన్ గెలుస్తాడు - డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్య
By: Tupaki Desk | 28 Jun 2020 3:30 AM GMTఅమెరికా ఎన్నికలు అమెరికాకే కాదు, ప్రపంచానికి వార్త. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికుల విద్య, ఉపాధి డెస్టినేషన్ అది. అందుకే అక్కడి పరిణామాలను సునిశితంగా గమనిస్తుంటారు. చివరకు మన మార్కెట్లు కూడా అక్కడి పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తుంటాయి. అమెరికాలో రెండే పార్టీల మధ్య పోరు నడుస్తుంటుంది. రిపబ్లికన్స్ వర్సెస్ డెమొక్రాట్స్. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ రిపబ్లికన్. ఏ వ్యక్తికి అయినా రెండు సార్లే అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు రెండోసారి ప్రయత్నం చేస్తారు. అలాగే ట్రంప్ కూడా రెండోసారి పోటీలో నిలుస్తున్నారు.
పోటీలో ఉన్న వారు ఎవరైనా ఏ దేశం ఎన్నికలైనా తామే గెలుస్తాం అని పోటీలో నిలుస్తారు. మనల్ని మనమే నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం? కాబట్టి పోటీ చేస్తున్నాం అంటే మనం గెలుస్తామన్న నమ్మకంతోనే కదా. కానీ వివాదాస్పద ట్రంప్ మాత్రం... వచ్చే ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ గెలుస్తాడు అంటున్నాడు. అమెరికా చరిత్రలో ఒక రిపబ్లికన్ అభ్యర్థి ... తన ప్రత్యర్థి గెలుస్తాడని చెప్పడం ఇదే మొదటి సారి. ఈ ఏడాది నవంబర్‌లో జగరబోయే ఎన్నికల్లో ఇద్దరి మధ్య పోరు హోరీగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
మీరు వీటిని సీరియస్ గా తీసుకుంటే పప్పులే కాలేసినట్లే... ట్రంప్ ఆ ఒక్కమాటే అనలేదు. ఇటీవల వచ్చిన ఒక సర్వే నేపథ్యంలో ఈ కామెంట్స్ చేసిన ట్రంప్ అసలు జోబిడెన్ మంచోడా చెడ్డోడా అన్నది పాయింట్ కాదు... అర్హతలు ఉన్నోడా కాదా అని చూడాలి అంటూ కామెంట్లు చేశారు.
నేను ఎన్ని చేశాను? అమెరికా చరిత్రలో నా హయాంలోనే అత్యధిక మందికి ఉపాధి దొరికింది. అయినా కొందరికి నేను నచ్చడం లేదు. అందుకే జో బిడెన్ గెలుస్తాడు అంటున్నాను. అతనికి రెండు వాక్యాలు మాట్లాడటం రాదు. సరిగ్గా మాట్లాడటం కూడా రాని వ్యక్తి అధ్యక్షుడు కావడం మీకు ఇష్టమేనా? అని అమెరికన్లు ప్రశ్నించారు డొనాల్డ్ ట్రంప్.
ట్రంప్ ఇలా అంటున్నాడు గాని గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటన ట్రంప్ ని దెబ్బతీస్తుందని అందరూ అంటుంటే... అదే తనకు ప్లస్ అనుకుంటున్నాడట ట్రంప్. ఇటీవలే కరోనా ను కూడా వాడుకుంటున్నాడు. ఇమ్మిగ్రేషన్ పై కఠినంగా వ్యవహరించి డిసెంబరు వరకు బ్యాన్ చేశారు. ఎందుకని అడిగితే ముందు మా అమెరికన్లకు ఉద్యోగాలు కావాలి. కరోనా వారి ఉద్యోగాలను పోగొట్టింది అంటున్నారు. ఇది ఎన్నికల ఎత్తుగడే.